మనసున్న మారాజు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

మంత్రి కన్నబాబు

ముమ్మిడివరం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మనసున్న మారాజు అని మంత్రి కన్నబాబు కొనియాడారు. ముమ్మడివరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కన్నబాబు మాట్లాడారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు బయలుదేరిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేను విన్నాను..నేనున్నానంటూ భరోసాగా ముందుకు వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మత్స్యకారుల సమస్యలు పరిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌కు హృదయ పూర్వకంగా నమస్కారాలు తెలిపారు. చంద్రబాబు ఎన్నికల  సమయంలో హామీలు ఇవ్వడం ఎత్తుగడగా భావించారన్నారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను ఒక బాధ్యతలా, తపస్సులా భావించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను కేవలం ఐదు నెలల్లో ఎలా అమలు చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. మనసుంటే మార్గం ఉంటుందని, సీఎం వైయస్‌ జగన్‌ మనసున్న మారాజు అన్నారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా యజ్ఞంలా పని చేస్తున్నారన్నారు. యజ్ఞాలు భగ్నం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారని, ఇసుక, ఇంగ్లీష్‌లపై బురద జల్లుతున్నారని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. మంచి నాయకుడు వచ్చాడని ప్రకృతి పులకరించిందన్నారు. వైయస్‌ జగన్‌ కృషికి అందరం సైనికుల్లా మీ వెనకాలే నడుస్తామని కన్నబాబు పేర్కొన్నారు.

Read Also: మత్స్యకారులను ఇన్నాళ్లు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు

తాజా ఫోటోలు

Back to Top