నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం వెనుక కుట్ర కోణం

ఎవరి డైరెక్షన్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు

ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. కరోనా సేకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని మంత్రి కన్నబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిమ్మగడ్డ తన వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేశారని ధ్వజమెత్తారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదని నిమ్మగడ్డను ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎవరి డైరెక్షన్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే వైయస్‌ జగన్‌ సర్కార్‌ లక్ష్యమన్నారు. 
 

Back to Top