ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం

చంద్రబాబు కావాలనే రైతుల్ని రెచ్చగొడుతున్నారు

ప్రతిపక్ష నేత వ్యవస్థల్ని దారుణంగా కించపరుస్తున్నారు

వ్యవసాయ మంత్రి కన్నబాబు 

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హైపవర్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. రాజధాని ప్రాంతంలో ఏదో జరుగబోతుందని నిజమైన రైతుల ఆవేదనలో ఉంటే ..చంద్రబాబు అంతకంటే ఎక్కువగా ఆవేదన, ఆందోళన ఉన్నారు. చంద్రబాబు సినిమా నటుడు బ్రహ్మానందం మాదిరిగా తయారు అయ్యారు. ఆయన ఆనందంగా ఉంటే ప్రజలు పండుగ చేసుకోవాలి. ఆయన బాధలో ఉంటే ప్రజలు పస్తులుండాలి. చంద్రబాబు మాత్రం సంక్రాంతి చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు నిన్న నారావారిపల్లె వెళ్లి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చంద్రబాబు లేని ఉద్యమాన్ని క్రియేట్‌ చేసి ఆ పార్టీ శ్రేణులను రోడ్డుపైకి పంపిస్తున్నారు. పండుగపూట అయినా రైతులను, రాష్ట్ర ప్రజలను ప్రశాంతంగా ఉంచేలా చంద్రబాబు వ్యవహరించాలి. ప్రజలను తప్పుదారి పట్టిస్తే చంద్రబాబుకు మర్యాదగా ఉండదు. వ్యవస్థలను చాలా దారుణంగా కించపరుస్తున్నారు. డీజీపీ గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.నార్త్‌, ఈస్టూ ఆఫీసర్లు అంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు. గౌతంసవాంగ్‌ మీ వద్ద కూడా విజయవాడ సిటీ కమిషనర్‌గా పని చేశారు.  వ్యవస్థలను కించపరిచే కార్యక్రమం చంద్రబాబు చేయవద్దని చెబుతున్నాం.ఈ నెల 17వ తేదీ వరకు ఎవరైనా సరే సలహాలు, సూచనలు ఇస్తే..హైపవర్‌ కమిటీలో చర్చిస్తాం.
 

తాజా వీడియోలు

Back to Top