ఏపీలో జనరంజక పాలన సాగుతోంది

మేధావులు సైతం ఆశ్చర్యపోయేలా సంక్షేమ పథకాలు అమలు

అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పథకాలు

గాడి తప్పిన వ్యవస్థలను చక్కదిద్దేలా చర్యలు

టీడీపీ నేతలు కడుపుమంటతో రగిలిపోతున్నారు

పరిపాలనను పక్కదారి పట్టించేలా టీడీపీ కుట్రలు

రాష్ట్రాన్ని ముంచడంలో పేటెంట్‌ చంద్రబాబుది

సొంత మామ నుంచి ప్రజల వరకు అందర్నీ ముంచాడు

ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి:  ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆరు నెలల్లోనే వైయస్‌ జగన్‌కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన కుమారుడికి, ఆయన మందిమాల్భలానికి కడుపు మంట ఎక్కువైందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముంచింది చంద్రబాబే అని, పిల్లనిచ్చిన మామతో సహ అందరిని ముంచాడని, ముంచే పేటెంట్‌ చంద్రబాబుదే అన్నారు. వైయస్‌ జగన్‌ ఆరు నెలల పాలనపై టీడీపీ విడుదల చేసిన పుస్తకాన్ని బయటకు విడుదల చేస్తే ప్రజలు చంద్రబాబు ఛీకొడుతారని, వైయస్‌ జగన్‌పై ఆరు నెలల్లోనే ఇంత దుష్ర్పచారం చేస్తారా అని బుద్ధి చెబుతారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర  కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నబాబు ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

జనరంజకంగా వైయస్‌ జగన్‌ పాలన కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువుగా, అత్యంగా వేగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గతంలో చంద్రబాబు చాలా దారుణంగా వ్యవస్థలను విచ్చిన్నం చేసి వదిలివెళ్లిన తరుణంలో వైయస్‌ జగన్‌ ఏవిధంగా గాడీలో పెడతారని ఆసక్తితో చూశారన్నారు. దేశంలోనే బాగా పని చేసే ముఖ్యమంత్రుల పేరు తీసుకుంటే పైవరుసలో వైయస్‌ జగన్‌ పేరు కనిపిస్తోందన్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా అందరి మన్ననలు పొందే విధంగా ప్రస్తుత పరిపాలన కొనసాగుతోంది. మూడు కీలక నిర్ణయాలు వైయస్‌ జగన్‌ తీసుకున్నారు. ఇది సాధ్యమా అని గతంలో ఎవరు తీసుకోలేని నిర్ణయాలు వైయస్‌ జగన్‌ కేవలం కొద్ది రోజుల్లోనే తీసుకొని ఒక మోడల్‌గా నాయకుల్లో కనిపిస్తున్నారు.

ఇవాళ వైయస్‌ జగన్‌ పాలన తీరు, ఆయన  ఇచ్చిన హామీల అమలు చేసే విధానం, మరోవైపు అవినీతిరహిత పాలన, ఇంకోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేసే విధానం. మరోవైపు గాడితప్పన వ్యవస్థలను సక్రమ పద్ధతిలో పెట్టే కార్యక్రమాలు, ఇంకోవైపు సంస్కరణలు, ఇవి కాకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం వైయస్‌ జగన్‌ పాలన తీరు నిజంగా అభినందనీయమని రాజకీయ విశ్లేషకులు, పెద్దలు చెబుతుంటే ఆయనతో పాటు పని చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నామన్నారు. ఇంకా పేరు తెచ్చుకునే విధంగా పని చేస్తున్నాం. ఎవరికి సాధ్యంకాని నిర్ణయాలు తీసుకుంటుంటే కొందరికి కడుపు మంట పెరిగిపోతోంది. వారి బాధలు వర్ణణాతీతం. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌, టీడీపీ అనుయయూలు, వారి మందిమార్బలం కడుపు మంట ఎక్కువైంది. ఈ విధంగా ఈ పరిపాలనను పక్కదారి పట్టించడం, ఏ విధంగా వైయస్‌ జగన్‌కు వస్తున్న మంచిపేరును చెడగొట్టేందుకు లక్ష్యంగా పని చేస్తున్నారు.

ఇసుక, ఇంగ్లీష్‌, రాజధానిలో ఏదో జరిగిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారు.  చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీలో రోజుకో అబద్ధం ఉత్పత్తి చేసి..ఆ అబద్ధంతో విష బీజాలు నాటి చెడ్డపేరు వచ్చే విధంగా చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఏదో విధంగా టీడీపీని నిలబెట్టుకోవాలనే తపన చంద్రబాబులో కనిపిస్తోంది. 23 సీట్లు ఎందుకు వచ్చాయో విశ్లేషించుకోకుండా వైయస్‌ జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే మీ పార్టీ నిలబడుతుందా అన్నారు. వైయస్‌ జగన్‌పై జరుగుతున్న దుష్ర్పచారం చేస్తున్నారు. 50 శాతం ఓట్లు, 80 శాతం సీట్లతో అధికారంలోకి వచ్చిన వైయస్‌ జగన్‌పై ఆరు నెలల్లో విష ప్రచారం పీక్స్‌కు చేర్చారు. ఈ రోజు టీడీపీ విడుదల చేసిన పుస్తకంలో ముంచే ముఖ్యమంత్రి అంటూ రాశారు. అసలు ఈ రాష్ట్రంలో ముంచే పెటేంట్‌ హక్కులు చంద్రబాబుకు కాకుండా మరెవరికైనా ఉందా అని ప్రశ్నించారు. ఆ పేటెంట్‌ మీదే కదా..ఎంతో మందిని ముంచారు. చివరకు మీ మామను కూడా ముంచింది మీరే కదా? ఇవాళ ఆరు నెలల్లోనే ముంచే ముఖ్యమంత్రి అంటూ మాట్లాడుతారా? మా నాయకుడు ఎవరిని ముంచలేదు.

Read Also: నవరత్నాలు అందరికీ అందించడమే మా లక్ష్యం

రాజధాని పేరుతో చంద్రబాబు రైతులను ముంచారు. పెట్టుబడుల పేరుతో పారిశ్రామికవేత్తలను ముంచారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను రాజధాని పేరుతో ముంచింది ఎవరు చంద్రబాబు అని అడుగుతున్నాం. కమీషన్ల పేరుతో కాంట్రాక్టర్లను ముంచారు. ఓటుకు నోటు పేరుతో పక్క ప్రభుత్వాన్నే ముంచాలని ప్రయత్నించింది నీవు కాదా?. కాపులను, దళితులను ముంచలేదా చంద్రబాబూ?. ఇసుక మాఫియా చేసి ఈ రాష్ట్రంలోనే భవన నిర్మాణ కార్మికులను ముంచారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ పేరుతో మహిళ జీవితాలను ముంచిన చరిత్ర చంద్రబాబుది. ఆఖరికి అర్చకులను, పూజరులను ముంచిన ఘనత చంద్రబాబుదే.  ముంచే సీఎం అన్నది చంద్రబాబుకు సూటవుతుంది. ఇన్ని రకాలుగా ముంచిన వాడివి కాబట్టే ఈ రోజు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. 23 సీట్లు ఇచ్చినా కూడా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదు. ఆరు నెలల పాలనలోనే వైయస్‌ జగన్‌పాలనపై పుస్తకాలు వేశావంటే అసలు నీవు నాయకుడివేనా?. నీవు పాలిచ్చే గోవువా?. గోవు అంటే ఈ రాష్ట్రాన్ని పిండేసి హెరిటేజ్‌ పాలతో వ్యాపారం చేయడమా?. గోవులాంటి రాష్ట్రాన్ని ముంచేసినోడివి నువ్వు. ఇవాళ సాదు జంతువులాగా వింతగా మాట్లాడుతున్నావ్‌.

ఒక్కసారి మనసులో మాట పుస్తకాన్ని గుర్తుకు తెచ్చుకో బాబూ? ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాలను చాలా చాలా హీనంగా అభిప్రాయాలు చెప్పిన వ్యక్తి ఆయన. నీ గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రాజధాని వ్యవహారంలో నీ కుమారుడు లోకేష్‌ను మంగళగిరిలో ఓడించడమే మీ పాలనకు నిదర్శనం కదా. అది కూడా మరచిపోయి మాట్లాడుతుంటే ఏం చెబుతాం. తండ్రి కొడుకులకు ఇద్దరికి కనీసం ఆత్మ పరిశీలన చేసుకునే మనసు లేదు. చంద్రబాబు పుస్తకంలో చాలా విషయాలు ప్రస్తావించాడు. మొత్తం పుస్తకాన్ని చూస్తే మే 23న వైయస్‌ జగన్‌కు పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన వెంటనే అబద్ధాలతో పుస్తకాన్ని రాసినట్లు కనిపిస్తోంది. అక్రమ నిర్మాణాన్ని తొలగించడం, చంద్రబాబు పథకాలను రద్దు చేయడంతో ఇది రద్దు చేసే ప్రభుత్వమని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. చంద్రబాబు అమలు చేసిన ఏ పథకం చూసినా కూడా అవినీతినే కనిపిస్తుంది. అలాంటిపథకాలను వైయస్‌ జగన్‌ ఎలా కొనసాగిస్తారు. మద్య నిషేదం గురించి టీడీపీ నేతలు బాధపడుతున్నారు. మద్యం ధరలు పెరుగుతున్నాయని తెగ బాధపడుతున్నారు.

చంద్రబాబు బెల్టుషాపులు రద్దు చేస్తానని తొలి సంతకం చేశాడు. ఒక్కటైనా రద్దు చేశాడా? వైయస్‌ జగన్‌ పాలనలో ఒక్క బెల్ట్‌ షాపైనా కనిపిస్తుందా? మీడియా హక్కులకు భంగం కలిగిస్తారా అని చంద్రబాబు పుస్తకంలో బాధపడ్డారు. చంద్రబాబు సొంత మీడియా హక్కులకు భంగం కలుగుతుందని బాధపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబులో అయోమయం కనిపిస్తోంది. పార్టీని కాపాడుకునేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు మీరు రాసిన పుస్తకాన్ని మడిచి లోకేష్‌ సూట్‌కేసులో పెట్టుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఈ పుస్తకాలు బయటకు పంపితే ఆరు నెలల్లోనే వైయస్‌ జగన్‌పై ఇంత దుష్ప్రచారం మొదలుపెట్టారా అని ప్రజలు మళ్లీ మిమ్మల్ని ఛీకొట్టే పరిస్థితి వస్తుంది.

ఆరు నెలలు కాకుండానే ఇంత హైరానా పడుతున్నారు. మళ్లీ చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. మొన్న గెలిచిన 23 మందిని కాపాడుకోలేకపోతున్నావు..టీడీపీ ఇవాళ బతికి ఉందంటే వైయస్‌ జగన్‌ దయనే కారణం. వైయస్‌ జగన్‌పై, ప్రభుత్వంపై అవాక్కులు, చవాక్కులు పేల్చితే బాగుండదు. అవినీతి సామ్రాట్‌ నీవు కాదా? అవినీతిలో ఏపీ మొదటిస్థానమని నీ హయాంలోనే కదా జాతీయ సంస్థలు రిపోర్టులు ఇచ్చింది. అవన్నీ మరిచిపోయారా? 2016లో ఎన్‌సీఈఆర్‌ సంస్థ ఏపీలో 74 శాతం అవినీతి జరుగుతుందని రిపోర్టు ఇచ్చింది. 2017లో దేశంలోనే రిచేస్ట్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ పేర్లు ఓ సంస్థ ప్రకటించింది. సీవీఎస్‌ అనే సంస్థ ఇండియన్‌ కరెప్షన్‌పై వేసిన నివేదికలో 77 శాతం అవినీతి ఉందని తేల్చింది. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి వచ్చిన పారిశ్రామికవేత్తలు బయపడి ప్రధానికి లేఖ రాశారు. బీహార్‌ కంటే ఘోరంగా అవినీతి ఉందని ఆ లేఖలో పేర్కొనలేదా? అవన్నీ మరిచిపోయి అవినీతి జరుగుతుందని, అక్రమాలు జరుగుతున్నాయని డ్రామాలాడుతున్నారు.

రాజధానికి వచ్చి నేలను ముద్దుపెట్టుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజమౌలి, బోయపాటితో గ్రాఫిక్స్‌ చూపించి, రైతుల నుంచి భూములు లాక్కొని వారికి ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేశావు. నీ బంధువులకు, నాయకులకు ముందే చెప్పి ఇక్కడ భూములు కొనుగోలు చేయించి, అక్కడ ఏమీ చేయకుండా  ఇవాళ వచ్చి భూమిని ముద్దు పెట్టుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ చెప్పినవే కాదు..,చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు. మేనిఫెస్టో అంటే ఎలా ఉండాలో వైయస్‌ఆర్‌సీపీని చూడండి. ఇప్పటికే 90 శాతం మేనిఫెస్టో అమలు చేశారు. మీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా?. ఆత్మ పరిశీలన చేసుకోకపోతే చంద్రబాబును మళ్లీ ప్రజలు ఛీకొడుతారని మంత్రి కన్నబాబు హెచ్చరించారు.

Read Also: నవరత్నాలు అందరికీ అందించడమే మా లక్ష్యం

Back to Top