నిజమైన రైతు బాంధవుడు సీఎం వైయస్‌ జగన్‌

మంత్రి కన్నబాబు
 

తాడేపల్లి: రెండేళ్లుగా రైతులకు ఏ కష్టం రాకుండా, ఏ కొరత లేకుండా పాలన సాగిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతులకు నిజమైన బాంధవుడని మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు. వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడారు. నవరత్నాల్లో భాగంగా వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇసూ.్త మేనిఫెస్టోలో చెప్పినట్లు అక్షరం కూడా తప్పిపోకుండా అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాత్రమే అన్నారు.  ఈ ఒక్క నెలలోనే రూ.5,800 కోట్లు రైతులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇది చరిత్ర.. దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇలాంటిది సాధ్యం కాలేదు. పంట నష్టపోయామని రైతులు అన్నప్పుడు అధికారులు వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేసి సకాలంలోనే రైతులకు సహాయం అందించేలా సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారు. ఈ రోజు 15.15 లక్షల మంది రైతులకు పంటల బీమా అందజేస్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించలేదు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. 2018–2019లోనే రూ.7 వేల కోట్ల బకాయిలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. దేశంలో ఎక్కడా కూడా 21 రకాల పంటలకు ఇన్సూరెన్స్‌ ఇవ్వడం లేదు. రైతులు ఇంత మంది పంటల బీమా పరిధిలోకి రావడం కారణం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించడమే. కంపెనీల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే బీమా చెల్లించడం గొప్ప అంశం. రెండేళ్ల కాలంలో రైతులకు ఏ కొరత లేకుండా చూస్తున్నారు. దీర్ఘ కాలిక ప్రయోజనాలు అందిస్తూ రెండేళ్లుగా రైతులకు నిజమైన రైతు బంధవుడిగా పని చేస్తున్నారు. అందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మంత్రి కన్నబాబు  కృతజ్ఞతలు తెలిపారు.  

Back to Top