పులివెందుల: లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్ధానిక పరిశోధనలతో పాటు అంతర్జాతీయ స్ధాయిలో కూడా పరిశోధనలు చేయాలని ఈ రోజు జర్మన్ ప్రభుత్వం, కేంద్రం, నీతిఆయోగ్, ఐకార్‌తో పాటు పలు విశ్వవిద్యాలయాల సహకారంతో రైతాంగానికి అండగా నిలబడేందుకు పులివెందులలో స్ధలాన్ని, భవనాలు కేటాయించడం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికతకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.ఏపీ కార్ల్‌లో న్యూటెక్ బయోసైన్సెస్ శంకుస్ధాపన కార్యక్రమంలో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి, ప్రకృతి వ్యవసాయదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే ఈ రోజు ఇండో జర్మన్ ప్రపంచ ప్రకృతి వ్యవసాయ విజ్ఞాన పరిశోధన అకాడమిని ప్రారంభించిన సీఎంగారికి, అందరికీ నమస్కారం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు రైతుల అభివృద్ది, సంక్షేమం కోసం పని చేసిన సందర్భాలు ఉండి ఉండచ్చు కానీ మన సీఎం శ్రీ జగన్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా, రైతాంగం, వ్యవసాయం పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి...బహుశా గతంలో ఏ సీఎం కూడా చూపించలేదని మనమంతా ఒప్పుకోవాలి. ఈ నేపధ్యంలో ప్రధానంగా ఖర్చులు తగ్గించుకోవాలి, దిగుబడులు పెంచుకోవాలి, దాంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రసాయనాలు లేనటువంటి ఆహారాన్ని అందించాలనే ఆలోచనలో భాగమే ఈ అకాడమి ఏర్పాటు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి వినియోగం మొట్టమొదటగా సీఎంగారు వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలకు ఉపయోగించాలన్న ఆలోచనకి ఆయనను అభినందించాలి. లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్ధానిక పరిశోధనలతో పాటు అంతర్జాతీయ స్ధాయిలో కూడా పరిశోధనలు చేయాలని ఈ రోజు జర్మన్ ప్రభుత్వం, కేంద్రం, నీతిఆయోగ్, ఐకార్‌తో పాటు పలు విశ్వవిద్యాలయాల సహకారంతో రైతాంగానికి అండగా నిలబడేందుకు పులివెందులలో స్ధలాన్ని, భవనాలు కేటాయించడం సీఎంగారి దార్శనికతకు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి, దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన సందర్భం. దాదాపుగా 10,778 ఆర్‌బీకేలు ఉన్నాయి, ఆ పరిధిలో రైతు శాస్త్రవేత్తలను తయారుచేయాలని సీఎంగారు ఆలోచించి నడుం బిగించారు. ముఖ్యమంత్రిగారి వేసిన ఈ అడుగు సత్ఫలితాలు ఇవ్వాలని, ఆయన కోరిక, ఆలోచన ఈ అకాడమితో ఆగిపోకుండా ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం స్ధాపించాలన్న లక్ష్యం ఉంది. ఆ లక్ష్యసాధన కోసం రైతాంగం సూచనలు, సలహాలు తీసుకుని ముందుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. సీఎంగారు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు, రైతు బాగుంటేనే రాష్ట్రం బావుంటుందని...కేవలం మాటలకే పరిమితం కాకుండా తాను నమ్మిన సిద్దాంతం విశ్వసించి ఈ రోజు రైతాంగం పట్ల అనుక్షణం ఆలోచించే ముఖ్యమంత్రిగారికి మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుశీల, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళ, పార్వతీపురం మన్యం జిల్లా అందరికీ నమస్కారం, నేను నా భర్త చనిపోయినా నాకున్న రెండు ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పంట బాగానే వస్తుంది, మహిళా సంఘాలలో చైతన్యం తీసుకొచ్చిన తర్వాత అందరూ నన్ను ఈ సాగు గురించి అడుగుతున్నారు, వారికి ట్రైనింగ్ ఇచ్చాను, నాకు వస్తున్న ఈ ఆదాయంతో మా పాపని బీఈడీ చేయించాను, ఊరందరినీ కూడా నేను ప్రకృతి వ్యవసాయంలోకి మార్చాను. మా ఊర్లో ఎవరూ పెస్టిసైడ్స్ వాడడం లేదు. నాకు గతంలో రాబడి తక్కువగా ఉండేది, ఇప్పుడు కేవలం రూ. 5 వేలు పెట్టుబడితో ఆదాయం బాగా పెరిగింది. ధన్యవాదాలు.