175 స్థానాల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విజయభేరి ఖాయం

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి 

నెల్లూరు జిల్లా: వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌భేరి ఖాయ‌మ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.  సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామ సచివాలయ పరిధిలో మంత్రి గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మాదిరిగా మొక్కుబడి పర్యటనలు కాకుండా, ప్రతి సమస్యను నమోదు చేసుకొని వాటిని పరిష్కరిస్తున్నామ‌ని చెప్పారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అన్ని హామీలు కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామ‌న్నారు.  2019 ఎన్నికల నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ అందించామ‌ని చెప్పారు.  మత్స్యకారేతరులతో పాటు మత్స్యకారులకు కూడా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌దే అన్నారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ గారు ఫిషింగ్ జెట్టీకి శంకుస్థాపన చేశారు త్వరలోనే, పనులు ప్రారంభించి, పూర్తిచేస్తామ‌ని చెప్పారు.  సుదీర్ఘకాలంగా పరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామ‌ని పేర్కొన్నారు.  ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నామ‌ని చెప్పారు.  గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించామ‌ని మంత్రి కాకాణి వివ‌రించారు.  

Back to Top