నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది

 మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 

అమ‌రావ‌తి:  అకాల వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతును ప్ర‌భుత్వం కుంటుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.  ఏపీలో అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లింద‌ని ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో చెప్పారు.  నష్టపోయిన రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీలోపాటు బీమా పరిహారం కల్పిస్తామ‌న్నారు. రైతులకు సీఎం వైయ‌స్ జగన్‌ భరోసా ఇచ్చార‌ని చెప్పారు.  చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నార‌ని విమ‌ర్శించారు. పట్టభద్రుల ఎన్నిక ప్రత్యేకమైన ప్రాధాన్యత క్రమంలో జరిగిన ఎన్నిక..చంద్రబాబు చేసుకున్నవి ఆఖరి విజయోత్సవాలని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు.  అసెంబ్లీలో చంద్రబాబు శాశ్వతంగా అడుగుపెట్టే అవకాశం లేద‌న్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top