బాబూ..దమ్ముంటే గుడివాడ మహానాడుకు నన్ను ఆహ్వానించు!

చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌
 

 కృష్ణా జిల్లా: ‘నీకు దమ్ముంటే గుడివాడ మహానాడుకు నన్ను ఆహ్వానించు.. అదే వేదికపై సామాజిక న్యాయంపై నేను చర్చకు సిద్ధం’ అంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ ఓపెన్‌ సవాల్‌ విసిరారు. జిల్లాల పర్యటనల్లో సీఎం జగన్‌ను చంద్రబాబు వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. చంద్రబాబు ఒక జోకర్‌లా, అయ్యన్న పాత్రుడు అండ్ కో బ్రోకర్లలా తయారయ్యారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలకు గుర్తుండి పోయే పథకం పెట్టారా. సామాజిక న్యాయం చేశానని చంద్రబాబు చెప్పగలిగారా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి 18 మందికి మంత్రి పదవులు ఇస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకి ఉందా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. 

‘‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీ లాక్కుని చంపేశావ్. ఏ మొహం పెట్టుకుని నిమ్మకూరు వస్తావ్. ఎన్టీఆర్ కొడుకులకైనా సిగ్గులేదా. చంద్రబాబు నిమ్మకూరులో అడుగు పెడితే పైనున్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభ పెడుతుందని’’ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

Back to Top