తాడేపల్లి: స్వర్గీయ ఎన్టీఆర్ మరణించి 28 సంవత్సరాలు అయినా ఆయన ఆత్మను నేటికీ చంద్రబాబు చంపుతూనే ఉన్నాడని, చిత్రవధ చేస్తూనే ఉన్నాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. వెన్నుపోటు పొడిచి వైశ్రాయ్ హోటల్ ముందు చెప్పులు, రాళ్లు, కర్రలతో కొట్టించి ఘోరంగా అవమానించి చంద్రబాబు.. నేడు ఎన్టీఆర్ శతజయంతి పేరిట ఎన్టీఆర్ విగ్రహానికి దండేసి, దండం పెడుతున్నాడన్నారు. దేవుడు క్షణకాలం ఊపిరిపోస్తే.. రాజమండ్రిలో ఆ మహానాడు వేదికపైనే చంద్రబాబు భరతం పడతానని, నిట్టనిలువునా పాతరేస్తానని ఎన్టీఆర్ కోరుకుంటాడన్నారు. ఎన్టీఆర్ చావుకు కారకులైన సిగ్గులేని వెధవలంతా ఒకచోట చేరి మహానాడు, శతజయంతి ఉత్సవాలు అంటూ ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ ఏం మాట్లాడారంటే.. మేనిఫెస్టో ప్రవేశపెడతానని మహానాడులో చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఎన్నికల ప్రణాళిక విలువ చంద్రబాబుకు తెలుసా..? 2014 ఎన్నికల ముందు 600 పైచిలుకు హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి కనీసం ఒక్క హామీనైనా ప్రజల దరికి చేర్చగలిగావా..? అధికారంలో ఉండగా ఏదేదో చేశానని నారా చంద్రబాబు వాగుతున్నాడు. అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు బీసీ నాయకులందరి ముందు బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు మొరుగుతున్నాడు. నారా చంద్రబాబు అనే వ్యక్తి బీసీలను బానిసలుగా మాత్రమే చూశాడు తప్ప.. వారి మేలు కోసం ఏ రోజూ పాటుపడలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకువస్తారు. చంద్రబాబు, ఆయన తాబేదారులకు చెబుతున్నాం.. బీసీలమంతా బలవంతులమయ్యాం. సామాజిక న్యాయం సీఎం వైయస్ జగన్‌తోనే సాధ్యమైంది. బీసీలకు ఆత్మగౌరవం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో సాధ్యమైంది. బీసీలంతా తలెత్తుకొని తిరుగుతున్నారంటే సీఎం వైయస్ జగన్ ఇచ్చిన రాజకీయ, ఆర్థిక, విద్య, ఆరోగ్యపరమైన ప్రతి అంశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఎదుగుదల ఉంది. వీటిపై చర్చించేందుకు రమ్మంటే టీడీపీ పారిపోతుంది. ఒక సెంటు స్థలం నువ్వు పడుకోవడానికి సరిపోదా అచ్చెన్నాయుడు.. నువ్వంటే పందిలా ఉన్నావు కాబట్టి ఒక సెంటు కాదు ఊరు కూడా సరిపోదు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందించారు. శరవేగంగా ఇళ్లు కట్టిస్తుంటే.. పడుకోవడానికి సరిపోదని ఆంబోతు అచ్చెన్నాయుడు తెగబలిసి మాట్లాడుతున్నారు. పనికిమాలిన చంద్రబాబు ఆ సెంటు స్థలంలో సమాధికి కూడా సరిపోదని నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ సెంటు స్థలంలో అక్కచెల్లెమ్మలు కట్టుకునే ఇంటి పునాదుల్లోనే టీడీపీ సమాధి కాబోతుంది. చంద్రబాబు ఏరోజు అయినా పేదలకు సెంటు స్థలం ఇచ్చారా..? చంద్రబాబు ఎన్ని రంకెలేసినా, ఎంత గాంఢ్రించినా.. సీఎం వైయస్ జగన్‌ను, వైయస్ఆర్ సీపీని ఇంచు కూడా కదిలించలేరు. ఎన్టీఆర్ 28 సంవత్సరాల క్రితం చనిపోయినా.. ఈరోజుకీ చంద్రబాబు చంపుతూనే ఉన్నాడు.. చిత్రవధ చేస్తూనే ఉన్నాడు. ఆయనకు దేవుడు వరం ఇచ్చి క్షణకాలం ప్రాణం పోస్తే చంద్రబాబును నిట్టనిలువునా పాతరేస్తాడు. అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ పరిపాలన సాగుతోంది. సంక్షేమ పథకాలను ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి అన్నదమ్ముళ్లకు చేరవేస్తున్న ప్రభుత్వం మనసున్న జగనన్న ప్రభుత్వం. డీబీటీ ద్వారా 2.10 లక్షల కోట్ల రూపాయలు ప్రజల బ్యాంక్ ఖాతాల్లో పంపించాం. ఎంతమందితో పొత్తుపెట్టుకొని పొర్లాడినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం వైయస్ జగన్‌ను ఏమీ చేయలేరు. 2024 ఎన్నికల తేదీ ఎప్పుడు రాబోతుందా.. ఎప్పుడు జగనన్న పక్షాన నిలవాలా అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పేదవర్గాలంతా ఏకతాటిపైకి వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు తోలు వలచబోతున్నారు’’ అని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.