పేదల ఇళ్లపై రామోజీకి ఎందుకంత కడుపుమంట..?

ఇళ్ల నిర్మాణంపై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తోంది

చంద్రబాబు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా, ఇళ్లు కట్టకపోయినా కమ్మగా ఉంటుందా..? 

ఇళ్ల నిర్మాణం పూర్తయితే సీఎంకు, మా ప్రభుత్వానికి మంచిపేరొస్తుందని అక్కసు

ఈనాడు రామోజీరావు చెత్తవార్తలు వండివారుస్తున్నాడు

రాక్షసుల్లా, శిఖండుల్లా, దుర్మార్గుల్లా మా నాయకుడిపై కుట్రలు చేస్తున్నారు

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ధ్వజం

తాడేపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జనహృదయ నేత సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో 31 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించామని, ఫేస్‌–1, ఫేస్‌–2 కింద 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే రామోజీరావుకు కళ్లు కనిపించడం లేదా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. పేదల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. ప్రభుత్వంపై బురదజల్లేలా ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, పేదల ఇళ్లపై రామోజీరావుకు ఎందుకంత కడుపుమంట..? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ ఏం మాట్లాడారంటే.. 
31 లక్షల మందికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందని ఏరోజు అయినా ఈనాడు పత్రికలో వార్త ప్రచురించగలిగావా..? ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే.. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రక్రియను నీ పేపర్, నీ ఛానల్‌లో ఎప్పుడైనా చూపించగలిగావా..? ఈనాడు పత్రికలో 1.80 లక్షలతో ఇళ్లు కట్టేదెలా..? అని ఇచ్చేదెంత, ఖర్చు అయ్యేదెంత..? అని రామోజీ రాశాడు. ఒకపక్క నువ్వే ఇచ్చేది సరిపోవడం లేదని, మరోపక్క ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలపై వక్రీకరించి రాయడం ఎంతవరకు సమంజసం

రాక్రిడ్ తో పాటు సుమారు 353 చిన్న చిన్న సంస్థలు ముందుకొచ్చి ఇళ్ల నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం. పేదలకు అండగా నిలబడతాం. జగనన్నకు తోడుగా ఉంటామని స్వచ్ఛందంగా వస్తే.. ఏం జరిగిపోయిందో రామోజీ చెప్పాలి. స్కామ్‌ జరిగిందా..? ముందుగా అడ్వాన్స్‌ ఏమైనా చెల్లించామా..? దోపిడీ చేసిపెట్టామా..? పేదలకు ఇళ్లు కట్టించాలని, ఆ సంస్థలన్నీ ముందుకొచ్చి మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని, సీఎం మన్ననలు పొందాలని వారు ముందుకొస్తే.. రామోజీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకపక్క ఇళ్ల నిర్మాణం జరగకూడదు, మరోపక్క విషం చిమ్మాలి.. ఆ ఇళ్ల నిర్మాణం జరిగితే సీఎం వైయస్‌ జగన్‌కు, మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతోనే ఈనాడు రామోజీరావు చెత్తవార్తలు వండివారుస్తున్నాడు. 

ఒక పక్క రూ.1.80 లక్షలు సరిపోవు అని రాస్తాడు. మరోపక్క స్వచ్ఛంద సంస్థలపై బురదవేయడానికి కుట్ర చేస్తున్నాడు. అసలు రామోజీరావుకు ఎందుకింత కడుపుమంట. చంద్రబాబు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా, ఇళ్లు కట్టకపోయినా మీకు కమ్మగా ఉంటుంది. మా ప్రభుత్వం 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు సుమారు 2.50 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపదను అందించేందుకు  ఇంత తాపత్రయపడుతోంది. శరవేగంగా ఇళ్ల నిర్మాణాల ప్రక్రియకు శ్రీకారం చుట్టి.. ఇసుక ఫ్రీగా, సిమెంట్‌ ధరలు తగ్గించి, ఐరన్‌ తగ్గించి ఇవ్వాలి.. ఇంటికి సంబంధించి వస్తువులు అతి తక్కువ ధరలకు అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ తపన పడుతున్నారు. 2024 మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరిగి.. అక్కచెల్లెమ్మలు గృహ ప్రవేశాలు చేసుకోవాలని, కుటుంబాలు సంతోషంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ తాపత్రయపడుతున్నారు. 

మొదటి రోజు నుంచి రాక్షసుల్లా, శిఖండుల్లా, దుర్మార్గుల్లా ప్రతీరోజూ కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొస్తారు. ఇలాంటి వారంతా వారికి సపోర్టు చేస్తారు. దేవుడి దయతో ఆ అడ్డంకులు తొలగి శరవేగంగా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ జరుగుతుంటే దీనిపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన ఓ అక్కకు బిల్లులు పడలేదని తప్పుడు వార్తలు రాశారు. ఆ అక్కకు రెండు బిల్లులు పడ్డాయి. రామోజీరావు తప్పుడు వార్త రాశాడని ఆ అక్క మళ్లీ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చింది. మా ప్రభుత్వం మీద, పేదల ఇళ్ల నిర్మాణంపై రామోజీరావుకు ఎందుకింత కడుపుమంట. ఒకపక్క కూల్చని ఇళ్లను కూల్చామని దుష్ప్రచారం.. ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. జరగడం లేదని మరోపక్క విషప్రచారం చేస్తున్నాడు` అని మంత్రి జోగి ర‌మేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top