దేశ చరిత్రలోనే ‘జగనన్నే మా భవిష్యత్‌’ ఓ రికార్డు

మంత్రి జోగి రమేష్‌

వారం రోజుల్లోనే 47 లక్షలకు పైగా కాల్స్‌

మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ జగనిన్నాదం

తాడేపల్లి: దేశ చరిత్రలోనే జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమం సరికొత్త రికార్డును నమోదు చేసిందని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ ప్రజలు నినదిస్తున్నారని చెప్పారు. గడప గడపకు వెళ్లి జగనన్న సైన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారని, కార్యక్రమానికి మద్దతుగా వారం రోజుల్లోనే 47 లక్షలకు పైగా కాల్స్‌ వచ్చారని వెల్లడించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణతో కలిసి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమం విస్తృతంగా ఇంటింటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, గృహ సారధులు వెళ్తున్నారని చెప్పారు. మా నమ్మకం నువ్వే జగన్‌అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారని తెలిపారు. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జనం సీఎం వైయస్‌ జగన్‌ స్టిక్కర్లను వాకిళ్లకు ఇష్టంగా అతికించుకుంటున్నారని తెలిపారు. జగనన్న సైన్యం రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్తున్నారని చెప్పారు. వారంలో 61 లక్షల గృహాలను సందర్శిస్తే 47 లక్షలకు పైగా మద్దతు తెలిపారన్నారు. వారంలోనే ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం దేశంలోనే చరిత్ర. స్వచ్ఛందంగా 82960 82960 నంబర్‌కు మిస్ట్‌ కాల్‌ ఇచ్చి మద్దతు తెలుపుతున్నారు. చరిత్రపుటల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల మద్దతు, సీఎం వైయస్‌ జగన్‌ పట్ల విశ్వాసం, దీవెనలు మెండుగా ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. జగనన్న అడుగులో అడుగులు వేస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం మాకు గర్వంగా ఉందన్నారు. ఇంతగొప్పగా పీపుల్స్‌ సర్వే ద్వారా ప్రజలు ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. ఇదేదో మొక్కుబడి సర్వే కాదు..జగనన్న సైన్యం ప్రజల వద్దకు వెళ్లి, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను చెప్పి వాళ్ల మద్దతుతో సర్వే చేస్తున్నారు. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తమ వెంటే ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు వెలువెత్తుతోందని చెప్పారు. మా భవిష్యత్‌ జగనన్నే, రాష్ట్ర భవిష్యత్‌ జగనన్నే, మన పిల్లల భవిష్యత్‌ జగనన్నతోనే సాధ్యమని ఇప్పడానికి ఇంతకన్న పెద్ద ఉదాహరణ ఉండదు. మీడియాలో చూస్తున్న ప్రతిపక్షాలకు, చంద్రబాబుకు కూడా తెలియజేస్తున్నాం. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు అని మంత్రి జోగి రమేష్‌ వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top