చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమే పవన్‌కు తెలుసు

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌

విజయవాడ: పవన్‌ కల్యాణ్‌ను నమ్మితే జనసేన పార్టీ శ్రేణులు నట్టేట మునగడం ఖాయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. జెండా, అజెండా, సిద్ధాంతం లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్, ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. విజయవాడలో మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ విజిటింగ్‌ వీసా మీద వచ్చి నోటికొచ్చినట్టుగా వాగిపోయాడన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే దమ్మూ, ధైర్యం జనసేన పార్టీకి ఉందా..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చెంచాగిరీ చేయడం ఒక్కటే పవన్‌కు బాగా తెలుసన్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడి, రెచ్చగొట్టి, హింసను ప్రేరేపిస్తున్నాడ‌న్నారు. ప‌వ‌న్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమీ లేదన్నారు. 
 

Back to Top