సమసమాజ నిర్మాత సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

న‌ర‌స‌రావుపేట బ‌హిరంగ స‌భ‌లో మంత్రి జోగి ర‌మేష్‌

న‌ర‌స‌రావుపేట‌: చంద్ర‌బాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఏమీ చేయ‌లేర‌ని, ఇది వాస్త‌వ‌మ‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సామాజిక న్యాయ ప్ర‌దాత‌, స‌మ‌స‌మాజ నిర్మాత అని కొనియాడారు. న‌ర‌స‌రావుపేట బ‌హిరంగ స‌భ‌లో మంత్రి జోగి ర‌మేష్ పాల్గొని మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు క‌ల‌లు కంటున్నాడ‌ని, ఇక జీవితంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాలేడ‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమసమాజ నిర్మాత.. చరిత్ర పుటల్లో రాసుకోదగిన ఒకే ఒక్క మొనగాడు, ధీశాలుడు.. అని కొనియాడారు. నిజమైన సామాజిక న్యాయం అమ‌లు చేసి చూపించార‌న్నారు. 

``చంద్రబాబు ఏం చేశాడు? ఊరికొక్క లోన్‌ మాత్రమే ఇస్తే, ఇవాళ జగన్‌గారు ప్రతి ఇంటికి ఒకటికి మించి పథకాలు అందించి లక్ష నుంచి 2 లక్షల వరకు ప్రయోజనం కల్పించారు. అందుకే ప్రతి ఒక్క కుటుంబం వైయ‌స్‌ జగన్ వెంటే ఉంది. వంగవీటి రంగాను హత్య చేసింది ఎవరు? చంద్రబాబు కాదా?.. సీఎం వైయ‌స్‌ జగన్‌ని ఓడించడానికి చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటాడట. ఆయన ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎంత పోరాడినా సీఎం వైయ‌స్ జగన్‌ని ఏమీ చేయలేరు. చంద్రబాబును మళ్లీ మళ్లీ బాదుతాం అని మా గడపగడపకూ కార్యక్రమంలో ప్రజలు చెబుతున్నారు. అంబేడ్కర్‌ మొదలు జగ్జీవన్‌రామ్‌ వరకు ఏ సంఘ సంస్కర్తను తల్చుకున్నా గుర్తుకు వచ్చేది సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌``. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top