సీఎం వైయస్‌ జగన్‌ పాలన దేశానికే ఆదర్శం

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఒక్క సంవత్సరంలోనే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రికల్లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లతో జైత్రయాత్ర సాగించి నేటికి ఏడాది పూర్తయిందని గుర్తుచేశారు. కర్నూలులోని వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి మంత్రి గుమ్మనూరు జయరాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్తులో కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కరోనా కట్టడికి సీఎం తీసుకున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. 

 

Back to Top