బాబు జెండా, ఎజెండా ఏపీ కోసమా? తెలంగాణ కోసమా?

సూటిగా ప్రశ్నించిన మంత్రి  గుడివాడ అమర్‌నాథ్‌

బీజేపీ పంచన చేరేందుకు బాబు రకరకాల వేషాలు 

ఒంటరిగా పోటీ చేయలేక పార్టీలను కలుపుకునే యత్నం

మోదీ, షా కాళ్లు పట్టుకున్నా బాబును దగ్గరకు రానివ్వరు

ఎన్ని జిమ్మిక్కులు చేసినా బాబును ప్రజలు నమ్మబోరు

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టీకరణ

తెలంగాణలో తాము బలంగా ఉన్నామని నమ్మించే యత్నం

తద్వారా ఆంధ్రలో బీజేపీ కలిసి వస్తుందని యోచన

కానీ ఖమ్మంలోనూ చంద్రబాబుకు దక్కని ఆదరణ

దాంతో ఉత్తరాంధ్రలో యాత్ర మొదలుపెట్టిన బాబు

అక్కడా ఆదరణ లేదు. ఇక అండమాన్‌కే వెళ్తాడేమో

బాబుకు బలముంటే.. బీజేపీని బతిమిలాడుతాడా..?

మంత్రి గుడివాడ అమరనాథ్‌ సూటి ప్రశ్న

చంద్రబాబుకు అన్ని చోట్లా పరాభవమే

పూర్తిగా మతి స్థిమితం తప్పిన చంద్రబాబు

ఆయనతో పిచ్చివాళ్లు తప్ప ఎవరూ వెళ్లరు

తేల్చి చెప్పిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే అర్హతే బాబుకు లేదు

అక్కడ ఆయన ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు

బాబు బినామీలే ఉత్తరాంధ్రను దోచుకు తిన్నారు

మంత్రి గుడివాడ అమరనాథ్‌ వెల్లడి 

ఆంధ్రప్రదేశ్‌పై చంద్రబాబు పిచ్చి విమర్శలు

ఆయన రాష్ట్రానికి ఒక శతృవులా మారాడు

అందుకే చంద్రబాబును రాష్ట్ర బహిష్కరణ చేయాలి

ప్రెస్‌మీట్‌లో కోరిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం:   చంద్ర‌బాబు జెండా, ఎజెండా ఏపీ కోసమా? తెలంగాణ కోసమా? అని మంత్రి  గుడివాడ అమర్‌నాథ్ సూటిగా ప్ర‌శ్నించారు.  తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉంది. ప్రజల్లో ఉనికి కోల్పోయిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనను ఎవరైనా జాకీలు పెట్టి పైకి లేపుతారా? అని చూస్తున్నారు. ఆంధ్రలో ఎక్కడ తిరిగినా ఎవరూ పెద్దగా పట్టించుకోక పోవడంతో.. మొన్న ఖమ్మం వెళ్లాడు. అక్కడా సొంత డబ్బా పేలకపోవడంతో ఉత్తరాంధ్రపై పడ్డారు. ఇక ఇక్కడా ఎవరూ నమ్మడం లేదంటే, ఏ తమిళనాడుకో లేదా అండమాన్‌ నికోబార్‌ దీవులకో వెళ్తాడేమో అని అనుమానం వ్య‌క్తం చేశారు. విశాఖపట్నం సర్క్యూట్‌ హౌస్‌లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి  గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.

మతి స్థిమితం తప్పిన బాబు:
    పర్యటనల్లో చంద్రబాబు పిచ్చిమాటల్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆయన పక్కనున్న పార్టీ నాయకులేమో 40 ఏళ్ల ఇండస్ట్రీ పెద్దమనిషికి ఏం చెప్పగలమని అమాయకంగా చూస్తున్నారు.     ‘చంద్రబాబూ.. రాజకీయాల్లో నేనేదో పెద్ద అది.. ఇది అని చెప్పుకుంటావు కదా.. మరి, ఇప్పుడు నీ పర్యటనల్లో నా పరిపాలన ఇది అని చెప్పవేంటి?’. వాస్తవానికి, ఏదైనా సభకు జనం వచ్చినప్పుడు ఆ నాయకుడు ఏం చెబుతాడోనని.. గతంలో ఏ విధమైన పరిపాలన అందజేశాడనేది వివరిస్తాడని.. భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతాడనేది తెలుసుకోవాలని వస్తారు. అంతేకానీ, నీ సొంత డబ్బా వినడానికి జనం రారు కదా?
    మీటింగుల్లో బాబు పిచ్చిమాటల్ని వినలేక జనం నవ్వుకుంటున్నారు. ఆ విషయం కూడా ఆయనకు తెలియడం లేదు. మతిస్థిమితం కోల్పోయిన చంద్రబాబుతో పిచ్చివాళ్లు తప్ప ఎవరూ కలిసిరారు.

బీజేపీతో జతకు పాకులాట:
    హైదరాబాద్‌లో చంద్రబాబు తన పార్టీ ఆఫీసుని రెండు నెలల క్రితమే బూజు దులిపి.. తెలంగాణలో లక్ష మందితో మీటింగ్‌ అన్నాడు. తన హెరిటేజ్‌ అక్కడ్నే ఉందంటున్నాడు. ఇప్పటికీ తాను తెలంగాణలోనే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇక హైదరాబాద్, సైబరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటూ అదే పనిగా ఊదరగొడుతున్నాడు. అసలు చంద్రబాబు జెండా, ఎజెండా ఆంధ్ర కోసమా? లేక తెలంగాణ కోసమా?.
    చంద్రబాబు ప్రయత్నమంతా బీజేపీ అధిష్టానం వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తు కోసం తనను పిలవక పోతారా? అన్నది. అదే చంద్రబాబు పాకులాటగా అర్ధం అవుతోంది. చివరకు ఏదో నాలుగు ఫొటోలు, పది పేపర్లుతో ఏ సృజనా చౌదరికో, సీఎం రమేష్‌కో, పురంధేశ్వరికో ఇచ్చి ఢిల్లీలో మార్కెటింగ్‌ చేయడానికి బాబు రెడీ అయ్యాడు. 

బలముంటే.. బతిమిలాడుతాడా?:
    బీజేపీతో జత కట్టేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలతో పాకులాడినా, నేల మీద దేకినా ఆనాడు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ఎలా నిందించాడో.. తిరుపతిలో అమిత్‌షా కారుపై ఏ విధంగా రాళ్లు వేయించాడో.. బీజేపీ అధిష్టానం మరిచిపోదు కదా? వాళ్లు కూడా బాబు దుర్మార్గ పనుల గురించి ఆలోచిస్తారు కదా? బీజేపీ పెద్దల దయ కోసం వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమైన చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. అయినా వారు దగ్గరకు రానివ్వరు.
    కానీ చంద్రబాబు వైఖరి చూస్తుంటే నాలుగు చిల్లర పైసల కోసం రోడ్ల మీద విన్యాసాలు చేసే కోతి చేష్టలా ఉంది తప్ప.. ప్రజల్లో ఉన్న నాయకుడి వ్యవహారంలా లేదు. నిజంగా బాబుకు బలముంటే జత కోసం బీజేపీని బతిమిలాడుతాడా?.

మరి కుప్పం ఏమిటి?:
    మొన్న ఖమ్మం వెళ్లిన చంద్రబాబు టీడీపీ తెలంగాణాలోనే పుట్టిందని అన్నాడు. అలాగే ఖమ్మం తన ఇంటి గుమ్మం అని చెప్పాడు. దీంతో కుప్పం కాదు.. ఖమ్మం అంటూ అక్కడి జనం ఫొటోలతో ఎల్లో మీడియా వార్తలు రాసింది.
    ‘ఖమ్మం నీ ఇంటి గుమ్మం అయితే మరి కుప్పం ఏమవుతుంది చంద్రబాబు’?. దీనికి  సమాధానం చెప్పగలవా?. చంద్రబాబుకు తెలంగాణ సొంత ఇల్లు అయతే, మరి ఆంధ్రప్రదేశ్‌ అద్దె ఇల్లే కదా?.

మంత్లీ గెస్టులు రాష్ట్రాన్ని శాసిస్తారా?:
    చంద్రబాబుకు ఇక్కడ సొంత ఇల్లు లేదు. ఐదేళ్ల కిందటి వరకు ఆయనకు ఇక్కడ కనీసం ఓటే లేదు. కుప్పంలో గానీ, చంద్రగిరిలో గానీ బాబు ఓటరు కాదు. అసలు ఏపీ మీద మమకారమే లేని బాబు, ఏపీ మొహమే చూడని రామోజీరావు, ఏపీతో సంబంధం లేని రాధాకృష్ణ.. హైదరాబాద్‌లోని బాబు ఇంటి సమీపంలోనే ఉండే పవన్‌కళ్యాణ్‌.. వీరు మంత్లీ గెస్టులుగా, వలస పక్షులుగా వచ్చి ఇక్కడ ఏపీ రాజకీయాల్ని శాసించాలనుకుంటారా? ఇక్కడి ప్రజలకు అంత అవగాహన లేదనుకుంటున్నారా?.
    రాష్ట్రంపై అర్ధం లేని పిచ్చి విమర్శలు చేస్తున్న చంద్రబాబు, నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు ఒక శతృవులా మారాడు. అందుకే ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి.

ఆ అర్హత మీకు లేదు:
    ఉత్తరాంధ్రకు మా ప్రభుత్వం ఏం చేసిందని రాజాంలో చంద్రబాబు ప్రశ్నించారు. మరి 14 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేశాడు? కనీసం ఒక్కటైనా చెప్పుకోగలడా?. అందుకే మా ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నాడు. 
    ఈ మూడున్నర ఏళ్లలో మా ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు కట్టిందని అడగడానికి చంద్రబాబుకు అసలు సిగ్గనేది ఉందా?. నిజం చెప్పాలంటే చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టడానికి హక్కు లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి గురించి మాట్లాడే, ప్రశ్నించే అర్హత ఏ మాత్రం లేదు.

బాబు నటనను నమ్మబోరు:
    రైతుల యాత్ర పేరుతో అమరావతి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను, పెయిడ్‌ ఆర్టిస్టులతో మా మీదకు (ఉత్తరాంధ్ర) దండయాత్ర చేయాలనుకున్నావు. కానీ చివరికి ఏమైంది?. తోక ముడిచి వెనక్కు తగ్గారు. ఇదీ చంద్రబాబు విలువలేని రాజకీయం.
    ఇలాంటి నీచమైన కార్యక్రమాలు పెట్టడానికి చంద్రబాబుకు ఏ మాత్రం నైతికత లేదు. ఏదైనా పోరాట పటిమ, సెంటిమెంట్‌ ఉంటే ఉద్యమాలు చేయించొచ్చు. అంతే కానీ, ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్లు నటించే చంద్రబాబు మాటల్ని ఎవరూ నమ్మబోరు. ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా నమ్మే పరిస్థితి లేదు.

వారే ఉత్తరాంధ్రను దోచుకున్నారు:
    ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యాపారాలు చేసేవాళ్లు. అత్యంత ధనవంతులంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. బినామీలు. విశాఖపట్నంలో ఖరీదైన భూముల్ని, ఆస్తుల్ని ఏ పార్టీ మనుషులైనా కబ్జా చేశారంటే, డాల్ఫిన్‌లు, గీతం వర్సిటీ, స్టూడియోలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రియల్‌ ఎస్టేట్లు.. ఇలా రకరకాలుగా చంద్రబాబు బంధువులు, ఆత్మబంధువులు రాబందుల్లా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దోచుకు తిన్నారు. 

సైకిల్‌కి దత్తపుత్రుడే మూడోచక్రం:
    ఇక సైకో చౌదరి గారు. సైకిల్‌ పాలన రావాలంటాడు. కానీ ఆ సైకిల్‌  తాను తొక్కలేడు. దాన్ని ఎక్కి కూర్చోనూలేడు. పోనీ, లోకేష్‌ ఎక్కి తొక్కితే అది అప్పడం అయిపోతుందని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే, దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నాడు. పవన్‌కళ్యాణ్‌ను మూడో చక్రంగా పెట్టుకుని సైకిల్‌ను పైకి లేపాలనుకుంటున్నాడు. బీజేపీ వాళ్లు వస్తారేమో.. తాను సైకిల్‌ మీద కూర్చొంటే వెనుక నుంచి తోసేందుకు.. ముందుకు లాగేందుకు నాలుగు పార్టీలొస్తే.. తాను మాత్రం రెండు వేళ్లు ఊపుకుంటూ సైకిల్‌ మీద పోవాలనుకోవడమే ఈ సైకో చౌదరి ఆలోచన.

దేశంలో మోడల్‌సిటీగా విశాఖ:
    మా ప్రభుత్వం ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా, కోస్తా, రాయలసీమలోనూ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తోంది.  ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నంలో జనవరి నుంచి మార్చి వరకు వరుసగా జరిగే అనేక సదస్సులు, సమ్మేళనాలు ఉత్తరాంధ్ర ప్రాంత బ్రాండ్‌ ఇమేజ్‌ను నిలబెట్టబోతున్నాయి. దేశానికే వన్నె తెచ్చే విధంగా, ఒక మోడల్‌ సిటీగా విశాఖ అభివృద్ధిని ఇప్పటికే చూస్తున్నాం. 

చంద్రబాబే అచ్చమైన సైకో:
    అశేష ప్రజాదరణ కలిగిన సీఎంగారిని తూలనాడటానికి చంద్రబాబుకు ఏ మాత్రమైనా సిగ్గుందా?. రోజుకో పిచ్చి మాట మాట్లాడే అచ్చమైన సైకో చంద్రబాబు. రాష్ట్రం సంక్షేమంతో సుభిక్షంగా ఉంటే బాబు సైకో కళ్లకు కనబడటంలేదు.
    ‘నీ తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పండి. నీ సొంత తమ్ముడ్ని ఇనుప సంకెళ్లతో గదిలో దాచిపెట్టావు కదా?. మరో రెండేళ్లలో అల్జీమర్స్‌ వచ్చి నీ కొడుకు చేతిలోనే నువ్వు కూడా అదే గతికి వస్తావు’.. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడకుండా, పిచ్చి విమర్శలతో మా మీద బురదజల్లడం మాను. మైక్‌ పట్టుకుని గంటలకొద్దీ మాట్లాడినా ప్రజలెవరూ నీ మాటలు నమ్మరని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Back to Top