విశాఖ: రాజధానిపై రెఫరెండం కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు మంత్రి అమర్‌నాథ్… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ప్రస్తవించారు.. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసింది టీఆర్ఎస్.. కానీ, కాంగ్రెస్ కాదన్నారు.. అయితే, ఎన్నికలకు సరదా ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.. ఈ సమయంలో రాజీనామాలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ ప్రజాభిప్రాయం తెలియజేయడానికి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలన్నారు.. ఇక, రాజధానిపై ఉమ్మడి కార్యాచరణను ప్రకటించిన నాన్ పొలిటికల్ జేఏసీకి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు.. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన ఉంటుందన్నారు మంత్రి అమర్‌నాథ్.. ఎల్.ఐ.సీ. కూడలి నుంచి చేపట్టే భారీ ప్రదర్శనలో అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగడతాం…. ఉత్తరాంధ్ర అభివృద్జి, వికేంద్రీకరణ కోసం పోరాటంలో ఇది తొలి ప్రయత్నం అన్నారు.. మీ అంతు చూస్తామనే ప్రగల్భాలు., తొడలు కొట్టడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కోర్టు అనుమతి ఇచ్చిందా..!? అని మండిపడ్డారు