విశాఖ అభివృద్ధి చెందితే ఎల్లో బ్యాచ్‌కి కడుపు మంట 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్  

 విశాఖకు రాజధానైతే అమరావతిలో చంద్రబాబు బినామీల భూముల రేట్లు తగ్గిపోతాయన్న బాధ, భయం 

 విశాఖలో ఎప్పుడో లక్షలాది మందికి అందాల్సిన ఇళ్లపట్టాలు అందకుండా బాబు మనుషులే కోర్టులకెళ్లారు 
 
చివరికి రుషికొండ తవ్వకాలపైనా దుర్మార్గమైన కథనం ప్రచురించారు. కేంద్ర అనుమతులున్నా అక్కసుతో విషపు రాతలు 

 కేంద్రం నుంచి సీఆర్‌జడ్ అనుమతులున్నా లేవని రాశారంటే విశాఖపై ఎంత అక్కసు ఉందో అర్థం చేసుకోవచ్చు 
 

తాడేప‌ల్లి: విశాఖ అభివృద్ధి చెందటం చంద్రబాబుకు, ఈనాడుకు, ఎల్లో మీడియాకు ఎప్పుడూ కడుపు మంటగానే ఉంటుంద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్ అన్నారు.   ఇక్కడ రాజధాని వస్తోందంటే.. ఏడ్చిన వ్యక్తులు ఎవరన్నది అందరికీ తెల్సు. అందులో నెంబర్ వన్ ర్యాంక్ వీరిదే. ఉత్తరాంధ్ర ఏమాత్రం తల ఎత్తుకొని నిలబడినా బినామీ భూముల రేట్లు అమరావతిలో తగ్గిపోతాయన్న బాధ, భయం.. చంద్రబాబుకు, రామోజీకి ఎప్పుడూ ఉంది. కాబట్టే.. ఎప్పుడు కుదిరితే అప్పుడు విశాఖ మీద విషం కక్కుతున్నారు. 

  విశాఖలో ఏ అభివృద్ధి జరగకూడదని ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్ని నిర్మిస్తుంటే వెంటనే వెళ్లి కోర్టులో స్టే తీసుకు వచ్చారు. విశాఖలో పేదలకు అందరితో పాటు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని వీరి మనుషులే.. కోర్టులకు వెళ్లారు. తద్వారా లక్షల మందికి ఏనాడో అందాల్సిన ఇళ్ల పట్టాలు అందకుండా పేదల నోరు కొట్టే కార్యక్రమం చేశారు. 

- విశాఖ సమీపంలో ఎయిర్‌పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఇదే తెలుగుదేశం కుట్ర పూరితంగా పిటిషన్లు వేయించింది. చివరికి.. ఇక్కడ ఎయిర్‌పోర్టు రాకుండా ఆపాలని.. బాబు మనుషులు వ్యవస్థల మేనేజ్‌మెంట్‌కు కూడా దిగారు. ఎందుకు ఇంత దిగజారారని .. మొత్తంగా ఉత్తరాంధ్ర తరుపున వీరిని ప్రశ్నిస్తున్నాం. 

- ఇక ఈరోజు రుషికొండ సాగరతీరంలో పరిమితులకు మించి ప్రభుత్వం తవ్వకాలు జరుపుతోందంటూ ఒక దుర్మార్గమైన ఐటం ప్రచురించారు. చివరికి సీఆర్‌జడ్ అనుమతులు కూడా వీరికి కనిపించటం లేదు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత కూడా సీఆర్‌జడ్ అనుమతులు లేవంటూ వార్త రాయాలంటే ఎంత అక్కసు ఉండాలో.. అర్థం చేసుకోవచ్చు. 

- కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ.. తీసుకొని ఇక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు అక్కడ భవనాలు ఉండేవి. ఆ విషయం కూడా ఈనాడు వేసిన ఫొటోలే కనిపిస్తోంది. ఎక్కువ భవనాలు నిర్మించుకుంటే.. అవి కూడా సీఆర్‌జడ్ పరిమితులకు లోబడి.. నిర్మించుకుంటే.. రామోజీ, చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారంటే.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే, విశాఖలో భారీ అభివృద్ధి కనిపిస్తే.. బాబుకు కొనిపించిన బినామీ భూములకు ఇక రేట్లు రావని.. భయపడిపోతున్నారు. మరి, ఇంతటి దుర్మార్గుల్ని భరించి ఊరుకోవాలా? పేపర్లు చదవటం మానేయాలా అన్నది..ప్రజలు నిర్ణయించుకోవాలి.

Back to Top