తాడేపల్లి: నేతన్న నేస్తం ద్వారా మగ్గాల ఆధునీకరణ పనులు ప్రారంభిస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యం, చేనేత శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వరసగా మూడో ఏడాది వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి.. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. ఈ నేతన్న నేస్తం ద్వారా ఈ రోజు ఎన్నో కుటుంబాలు లబ్దిపొందుతున్నాయి. మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడోసారి కూడా కోవిడ్‌లాంటి పరిస్ధితుల్లో కూడా నగదు జమచేస్తున్నారు. మా డిపార్ట్‌మెంట్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మగ్గాల ఆధునీకరణ చేస్తున్నాం, గతంలో చేనేతలు మగ్గానికి కింద కూర్చుని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నిలబడి చేసుకునేలా ఆధునీకరణ జరుగుతుంది. దీనివల్ల నేతన్నలకు ఆర్ధికంగా లబ్ది జరుగుతుంది. గతంలో రూ. 5 నుంచి 6 వేలు ఆదాయం వచ్చే వారికి ఇప్పుడు రూ. 25వేలు అధికంగా సంపాదించగలుగుతారు. మీరు ఇచ్చిన నేతన్న నేస్తం ద్వారా మగ్గాల ఆధునీకరణ పనులను కూడా ప్రారంభించేందుకు మేం సిద్దంగా ఉన్నాంమని మంత్రి తెలిపారు. మా వృత్తిపై మాకు ఆశలు చిగురించాయి: చిన్న వెంకటేశ్వర్లు, కృష్ణాపురం గ్రామం,వైఎస్‌ఆర్ కడప జిల్లా సార్ నేను గత ముప్పై సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాను, మాకు గత ప్రభుత్వంలో ఎలాంటి సాయం అందలేదు. కడు పేదరికంలో నలిగిపోయాం, అప్పుల భాదతో ఒకపూట తిని తినక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మీరు పాదయాత్రలో మా చేనేత కార్మికుల సాధకబాధకాలు విని మమ్మల్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తామని మాకు ధైర్యం ఇవ్వడంతో మా వృత్తిపై మాకు ఆశలు చిగురించాయి. మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాకు ఇది మూడోసారి నేతన్న నేస్తం ద్వారా నగదు జమ చేశారు, మీకు ధన్యవాదాలు సార్. మా చేనేత కుటుంబాలకు మీ తండ్రిగారు 50 ఏళ్ళకే చేనేత ఫించన్ మంజూరు చేశారు. అంతేకాదు మీ తండ్రిగారు మాలాంటి పేదలకు విద్యాదానం చేశారు, అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా మంచి చదువులు అందాలన్న లక్ష్యంతో ఫీజు రీఇంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. దాంతో నా కుమారుడు ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్నాడు, అంతేకాదు మీ తండ్రిగారు స్ధాపించిన యోగి వేమన యూనివర్శిటీలో నా కుమార్తె పీజీ చదివింది. బడుగు, బలహీనవర్గాలకు మంచి వైద్యం అందాలని మీ తండ్రిగారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు, మా కుటుంబంలో ముగ్గురికి కరోనా వస్తే రిమ్స్‌లో మంచి వైద్యం అందించారు. మీరు ఇచ్చిన డబ్బుతో నేను మగ్గాన్ని ఆధునీకరించుకుని సొంతంగా పట్టువార్పు, పట్టుదారం, జరీ తెచ్చుకుని నేను నాణ్యమైన వస్త్రాలను తయారుచేసుకుని మార్కెట్‌లో గిట్టుబాటు ధరకు అమ్ముకుని రెండింతల ఆదాయం పొందుతున్నాను. చేయూత కింద నా భార్యకు వచ్చిన డబ్బును నేను మగ్గం కిందే ఉపయోగించుకున్నాను. అలాగే డ్వాక్రా రుణం కూడా చేనేతకే ఉపయోగించుకున్నాను. వలంటీర్లు ప్రతీ నెలా ఇంటికే వచ్చి నిత్యావసరాలు ఇస్తున్నారు, అన్నీ ఇంటి ముందుకే వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు వైఎస్‌ఆర్ జిల్లా అని చెప్పగానే అక్కడ చక్కని పాలన అందిస్తున్నారని నాకు ఎంతో మర్యాద చేశారు. నేను చాలా సంతోషించాను. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అని ఒక కవి అన్నమాటను చెరిపేసి మీరు మాలాంటి బడుగు, బలహీనవర్గాల చేనేతలను ఆదుకుంటున్నారు. మీకు మా నేతన్నలు జన్మజన్మలా రుణపడి ఉంటారు. ధన్యవాదాలు సార్. మీరే మళ్ళీ రావాలి, మీరే కావాలి సార్: జి.జానకి, లబ్దిదారు, మంగళగిరి, గుంటూరు జిల్లా మీరు పాదయాత్రలో మా చేనేతల బాధలు చూసి నేతన్న నేస్తం పేరుతో మమ్మల్ని ఆదుకున్నారు. మా చేనేతల కుటుంబాల తరపున మీకు ధన్యవాదాలు సార్. ఈ కరోనా కష్టకాలంలో కూడా మళ్ళీ సాయం చేసి మా జీవితాలను నిలబెట్టారు. మేం నేసిన చీరలు అమ్ముకోవడానికి దుకాణాలు కూడా లేని సమయంలో ఈ సాయం మాకు ఎంతో ఆసరాగా నిలిచింది. మాకు ఎన్నడూ ఎవరూ చేయని సాయం మీరు చేస్తున్నారు. నవరత్నాలలో భాగంగా ఎన్నో పధకాలు అమలుచేస్తున్నారు. చేయూత పథకం ద్వారా చాలా లబ్దిపొందుతున్నాం. మీ వల్లే ఇన్ని కుటుంబాలు నిలబడుతున్నాయి. మా పిల్లలు కూడా కార్పొరేట్ చదువులకు తగ్గ విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మీరే మళ్ళీ రావాలి, మీరే కావాలి, మా ఊరి వారందరి తరపున మీకు ధన్యవాదాలు అన్నా. మీరు ఇచ్చిన భరోసానే: చిప్పల మార్కండేయ, ధర్మవరం, అనంతపురం జిల్లా మాది నిరుపేద కుటుంబం సార్, మీరు మా ధర్మవరం పాదయాత్రలో మాకు భరోసా ఇచ్చారు. మీరు గతంలో ఇచ్చిన డబ్బుతో మగ్గం మెటీరియల్, మిషన్స్ తెచ్చుకుని ఐదు రోజుల్లోనే చీర నేయగలుగుతున్నాం అంటే మీరు ఇచ్చిన భరోసానే. మాకు మగ్గం తప్ప బయట ప్రపంచం తెలియని సమయంలో మీరు సొంతంగా మార్కెటింగ్ చేసుకునే స్ధాయికి తీసుకొచ్చారు. మా చేనేత వృత్తి దిగజారిపోయిన సమయంలో మీరు మాట ఇచ్చిన విధంగా నూటికి నూరు శాతం సాయం చేస్తూ ఆదుకుంటున్నారు. ఈ కరోనా సమయంలో కూడా అన్నీ అందజేస్తున్నారు. మేం అన్నీ కూడా ఇంట్లో ఉండే తీసుకుంటున్నాం, మా కుటుంబ ఆదాయం కూడా పెరిగింది. మీరు మా కన్నీళ్ళు తుడిచారు. ప్రతీ చేనేత కార్మికుడి గుండెల్లో మీకు గుడికట్టారు. గత ప్రభుత్వంలో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఆ కుటుంబాలను రూ. 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. మీరు మా నేతన్నలను సామాజికంగా, ఆర్ధికంగా ఆదుకుంటున్నారు. వివిధ పథకాల ద్వారా మాకు చాలా సహాయం చేస్తున్నారు. గతంలో వైఎస్‌ఆర్ గారు జన్మనిస్తే మీరు మాకు పునర్జన్మనిచ్చారు. మీరు ఇచ్చిన ధైర్యం, భరోసానే మా జీవితాలలో వెలుగులు నింపాయి. నేతన్న, జగనన్న ఇద్దరూ ఒకటే, ఇదే మా అభిప్రాయం. మీరే ఎప్పటికీ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మీ పుణ్యమా అని మేం మూడు పూటలా తింటూ సంతోషంగా జీవిస్తున్నాం సార్, ధన్యవాదాలు. మా జీవితంలో వెలుగులు వచ్చాయి: సుబ్బలక్ష్మి, లబ్దిదారు, బండారులంక, అమలాపురం అన్నా మీరు గతంలో అంబాజీపేట వచ్చినప్పుడు నేను, నా భర్త వచ్చి చూసి సంతోషించాం. నేను గత 20 ఏళ్ళుగా నేత పనిలో ఉన్నాను, ఇటీవలే నా భర్త కన్నుమూశారు. తర్వాత ఎలా బతకాలి అనుకునే సమయంలో మీరు నేనున్నాను అని నేతన్న నేస్తం ద్వారా నగదు జమ చేశారు, మీరు చేసిన సాయంతో మా జీవితంలో వెలుగులు వచ్చాయి. నాకు మూడోసారి కూడా నగదు వస్తుంది. చేనేత అనేది అంతరించే సమయంలో మీరు నేతన్న నేస్తం ద్వారా ఆదుకుంటున్నారు. మీ దయతో మా చేనేత కుటుంబాలు హుందాగా జీవిస్తున్నాయి. నా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మా ఇంటికి వలంటీర్ వచ్చి అన్నీ ఇస్తున్నారు. వితంతు ఫించన్ వచ్చింది, ఆసరా పధకం వచ్చింది, నేతన్న నేస్తం కూడా తోడైంది. నా సొంతింటి కల నెరవేరింది, మీ దయ వల్ల నాకు ఇంటిస్ధలం వచ్చింది. మేం రోజంతా కష్టపడితే రూ. 200 మాత్రమే వచ్చేవి, మేం పనులు లేక ఇబ్బందులు పడేవాళ్ళం. మేం సొంతంగా నేసుకుని ఎక్కువ లాభాలు పొందుతున్నాము. మీ పాలనలో మేం ఎప్పుడూ చల్లగా ఉంటాం అన్నా...