అభివృద్ధికీ, సంక్షేమానికీ స‌మ ప్రాధాన్యం 

రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు

 కిష్ట‌ప్ప‌పేట‌లో ప‌లు అభివృద్ధి ప‌నులు ప్రారంభం 

 శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అభివృద్ధికీ, సంక్షేమానికీ స‌మ ప్రాధాన్యం  ఇస్తున్నామ‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు.  మండ‌లంలోని, కిష్టప్పపేటలో మంత్రి ధ‌ర్మాన ప‌ర్య‌టించి రూ.66.42 లక్షల రూపాయ‌లతో చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంత‌రం సంబంధిత నిర్వాహ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రూ.15.80 లక్షల వ్యయంతో నిర్మించిన వెల్నెస్ సెంట‌ర్-ను, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని,రూ.28.84 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ స్కూల్ ప్రహరీని ప్రారంభించారు. అదేవిధంగా ఇదే గ్రామంలో ప్ర‌తిపాదిత బస్ షెల్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..అన్ని స‌దుపాయాలూ కలిగిన విశాఖను రాజధానిగా చేయాలని మన ప్రభుత్వం భావిస్తోంది. ఆ రోజు రాజ‌ధాని ప‌నుల నిమిత్తం మన తాతలు చెన్నై వెళ్తే..మ‌న తండ్రులు కర్నూల్ వెళ్ళారు. మనం హైద్రాబాద్ వెళ్ళాం. కానీ ఇవాళ అందుకు భిన్నంగా మా ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. ఈ ప్రాంత వాసుల ఆకాంక్ష‌ల‌ను దృష్టిలో ఉంచుకుని విశాఖ‌ను రాజ‌ధాని చేస్తాం అని అంటోంది. ఇందుకు సంబంధించి నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. కానీ ఆ రోజు విప‌క్ష నేత చంద్రబాబు రాజ‌ధాని ఏర్పాటు పేరిట అమరావతి రైతుల దగ్గర భూములు కొట్టేశారు. వారికి  త‌గిన న్యాయం చేయాల్సి ఉన్నా, చేయ‌లేదు.
విశాఖ రాజధాని అయితే ఆ ప్రాంతంతో స‌హా చుట్టూ పక్కల ఉన్న మ‌న రెండు జిల్లాలూ అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశా లు పెరుగుతాయి. పెట్టుబడులు వస్తాయి. పక్కన ఉన్న వైజాగ్ ని వదిలి అమరావతి కోసం మాట్లాడే వారిని ఏం అనాలి ? మా  ప్రభుత్వం హయాంలో ప్రజలదరికి ఎన్నడూ లేనంత మంచి జరిగింది. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ ఏమీ ఆశించకుండా నిస్వా ర్థంగా పని చేశారు. 2019 ముందు ఎన్నికల ముందు చెప్పినవి అని పూర్తి చేశాం. ఎన్నిక‌ల ప్రణాళిక (మ్యానిఫెస్టో)ను ప్రామాణి కంగా తీసుకుని తూ.చ‌.తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిది. వ్యతిరేక  వర్గాలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందించాం. టీడీపీ హయాంలో ఆ రోజు ఉన్న ప‌రిస్థితుల రీత్యా గ్రామాల‌లో ప్ర‌జ‌లు ఇంటి మీద జెండ కడితేనే,పసుపు చొక్కా వేస్తే,పార్టీ కండువా క‌ప్పుకుని తిరిగితేనే పథకాలు వచ్చేవి. కానీ ఇవాళ అలా లేదు. లంచ‌గొండిత‌నం లేదు. ప‌థ‌కాలు అందవు అన్న మాటే లేదు. పార్టీల‌కు అతీతంగా అంద‌రికీ ప‌థ‌కాలు అందించిన తార్కాణాలు ఉన్నాయి. టీడీపీ  కీల‌క నేత‌ల‌కు కూడా ప‌థ‌కాలు అందిన వైనం ఉంది. అందుకు రుజువులు కూడా ఉన్నాయి. ఇంత‌కుమించిన నిద‌ర్శ‌నం ఏముంది ? ఆ..రోజు పార్టీ చూడం..మ‌తం చూడం..కులం చూడం..ప్రాంతం చూడం.. అర్హ‌త‌ను ప్రామాణికంగా చేసుకుని ప‌థ‌కాలు వ‌ర్తింప జేస్తాం అని చెప్పాం. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వై.య‌స్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాం మాకు ఓటు వెయ్యండి అంటూ ఇవాళ ప్రతిపక్ష పార్టీల నేత‌లు మీ ముందుకు వస్తున్నారు. ఆ రోజు మీరు 2014 నుంచి 2019 వ‌ర‌కూ అధికారంలో ఉన్నారు కదా ఎందుకు చేయలేకపోయారు అని ప్ర‌శ్నిస్తు న్నాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జగన్ గొప్పా ? లేదా హామీలు గాలికి వదిలిన చంద్రబాబు గొప్పా..? ఒక్క‌సారి మీరే ఆలోచించి ఓ నిర్ణ‌యానికి,నిర్థార‌ణ‌కు రావాలి. ఇవాళ గ్రామాల్లో పూర్తిగా మార్పులు తీసుకు వచ్చాం. శాశ్వత భ‌వ‌నాలు నిర్మించాం.

ఇప్ప‌టివ‌ర‌కూ చేప‌ట్టిన చ‌ర్య‌లు అన్నీ స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డంతో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆదర్శంగా ఉంది. పేదలకు మన ప్రభుత్వం అందిస్తున్న  చేయూత మరెక్కడా లేదు. హిర‌మండ‌లం గొట్టా బ్యారేజీ దగ్గర రూ.185 కోట్లతో ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఒక‌టి ఏర్పాటు చేసి,వంశ‌ధార న‌దీ జ‌లాల‌ను మండుటెండ‌లో సైతం అందిస్తాం. ఇప్ప‌టికే సంబంధిత పనులు జరుగు తున్నాయి. త్వరలో మీకు వంశ‌ధార నీరు అందుతుంది. మీ క‌ల‌లు నెర‌వేరుతాయి. మండుటెండలో గ్రామాల్లోని పంట కాలువ ల‌లో చల్లని వంశ‌ధార నీరు ప్ర‌వ‌హింప‌జేస్తాం. మూడు పంట‌లను పండిచాల‌న్న రైతు క‌ల‌ను సైతం నెర‌వేర్చ‌నున్నాం.. అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు.

డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, ఎంపిపి అంబటి నిర్మల, రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు రావు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్ధన రావు,మండల పార్టీ ఉపధ్యక్షులు బాన్న నర్సింగ రావు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గుండ హరీష్, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, ఎంపీటీసీ రూప్పా అప్పల సురి, బగ్గు అప్పారావు, నక్క శంకర్,  నాయకులు గుండ రఘుపతి నాయుడు, అల్లు లక్ష్మి నారాయణ, చిట్టి రవి కుమార్, బలగ గణపతి పట్నాయక్, అప్పన్న స్వామి, పోనాన్న మాధవ్, యజ్జల గురుమూర్తి, ఎంఎల్బి శాస్త్రి పాల్గొన్నారు.
 

Back to Top