రోడ్లను అనుసంధానం చేస్తాం

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌
 

విశాఖ: టెండర్లలో అవినీతి లేకుండా రోడ్లు నిర్మిస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మిస్తున్నామని చెప్పారు. 400 వంతెనల నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.329 కోట్లు మంజురయ్యాయని తెలిపారు.సీలేరు-భద్రాచలం, అరకు- రాజమండ్రి రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

Back to Top