తూర్పు గోదావరి: చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కానీ, చంద్రబాబు వాటిని గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది, అందుకే ప్రజలు విస్మరించారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీని ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తే మాత్రం కుదరని వార్నింగ్ ఇచ్చారు. బాబే అసలైన సైకో: గౌరవ సీఎంగారిపై చంద్రబాబు పేట్రేగిపోయి కారుకూతలు కూస్తున్నాడు. నిజానికి అసలు సైకో చంద్రబాబే. సైకోలు ఎలా ప్రవర్తిస్తారో నిన్న చంద్రబాబు పర్యటనలో చూశాం. ఆ విషయం ప్రజలకూ అర్థమైంది. కొడుకు చూస్తే చేతకాని చవట దద్దమ్మ. అతడి పాదయాత్ర ఎక్కడా ప్రజాదరణ లేక ఘోరంగా విఫలమైంది. ఇది చంద్రబాబుకు మానసిక క్షోభ మిగులుస్తోంది. దీంతో దిక్కు తోచని చంద్రబాబు చట్టాలను గౌరవించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. సంఘవిద్రోహి చంద్రబాబు: సామాన్య ప్రజల మొదలు రాష్ట్రపతి వరకు అందరూ చట్టాలను గౌరవించి తీరాలి. కానీ తాను రాజ్యాంగానికి అతీతం అనుకుంటున్నాడు ఈ వెర్రి బాబు. చట్టాన్ని ఉల్లంఘిస్తేనే నాయకుడిగా ఇంకా ఎదుగుతామని ఆయన భావిస్తున్నాడు. చంద్రబాబుకు వయసు మీద పడింది. మతి భ్రమించింది. అందుకే చట్టాలను అతిక్రమిస్తూ సైకోలా మారాడు. చివరకు తనకు రక్షణ కల్పించే పోలీసులనూ గౌరవించడం లేదు. వారిని నిందిస్తున్నాడు. యథేచ్ఛగా చట్టాలు అతిక్రమిస్తున్న చంద్రబాబు ఒక సంఘ విద్రోహిలా మారుతున్నాడు. ప్రజలు ఛీ కొడుతున్నారు: నడిరోడ్డు మీద బహిరంగ సభకు సిద్ధమైన చంద్రబాబును పోలీసులు నిలవరించే ప్రయత్నం చేయడంతో, నిరసన వ్యక్తం చేస్తూ నడక మొదలు పెట్టిన చంద్రబాబు నడిచింది కేవలం 4 కి.మీ అయినా, 7 కి.మీ నడిచినట్లు అట్టహాసంగా ప్రచారం చేశారు. చంద్రబాబూ అసలు నీవు దేని కోసం నడిచావు? నీ నటన కోసం నడిచావు. ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం నడిచావు. అందుకే నీ వ్యవహారశైలిని ప్రజలు ఛీ కొడుతున్నారు. ఆ అర్హత నీకు లేదు: ప్రజల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు చంద్రబాబు. ఎందుకంటే నీవు 2014 ఎన్నికల మందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నీ 5 ఏళ్ల పాలనలో నెరవేర్చలేదు. అదే సీఎం శ్రీ వైయస్ జగన్, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో మూడున్నర ఏళ్లలోనే 99 శాతం అమలు చేశారు. అలా ఒక నాయకుడు ఎలా ఉండాలన్నది చూపారు. ప్రజలే బుద్ధి చెబుతారు: మాట తప్పడం, మడమ తిప్పడం నీకు అలవాటు. అలాంటి నువ్వు జగన్‌గారిపై బురద చల్లుతావా? నీకు రెండు పత్రికలు, నాలుగు ఛానళ్లు తోడుగా ఉండడంతో, వాటి వత్తాసుతో ప్రచారం చేసుకుంటున్నావు. సీఎంగారిపై పిచ్చి విమర్శలు చేస్తున్నావు. నీ తప్పుడు విమర్శలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఆ స్థాయికి దిగజారావు: ప్రజల ప్రాణ రక్షణ ప్రభుత్వ బాధ్యత. నువ్వు రోడ్లపై సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తే.. వారి భద్రత కోసం ప్రభుత్వం జీఓ నెం.1 జారీ చేసింది. కానీ యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న నీవు, సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తానంటున్నావు. పోలీసులకు సహకరించవద్దని పిలుపు ఇస్తున్నావు. ఇంతకన్నా నీచం మరొకటి ఉంటుందా? చివరకు చట్టాలను కూడా గౌరవించని స్థాయికి దిగజారావు. నీ బండారం బయటపడి పోయింది. సహాయ నిరాకరణ అంటున్నావంటే, నీవెంత కంగారు పడుతున్నావన్న విషయం అర్ధమవుతోంది. నీది విఫల రాజకీయం: రాష్ట్ర విభజన నుంచి అన్నిటిలోనూ నీది విఫల రాజకీయమే. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ సాగించావు. తాత్కాలిక భవనాల పేరిట కోట్లు మింగేశావు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా నీ బండారం బయటపడింది. కమిషన్లకు కక్కుర్తి పడి, స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, డయాఫ్రమ్ వాల్ కట్టావు. ఇనుప రేకులు పెట్టి, ప్రాజెక్టు గేట్లు అమర్చినట్లు ప్రచారం చేసుకున్నావు. బస్సుల్లో ప్రజలను తీసుకుపోయి, భజన కీర్తనలు పాడించుకున్నావు. నీదంతా ప్రచార యావ తప్ప, వాస్తవ దృక్పథం ఎక్కడా లేదు. అందుకే నీది విఫల రాజకీయం. పోలవరాన్ని నీవు ఏటీఎంగా మార్చుకున్నావని సాక్షాత్తూ ప్రధాని మోదీగారే ఆరోపించారు. నీవా విజన్ గురించి మాట్లాడేది!: ఏ మాత్రం విజనరీ లేని నువ్వు విజన్ గురించి మాట్లాడడం జోక్. నిజానికి విజన్ ఉన్న గొప్ప నాయకుడు వైఎస్సార్. కురిసే వర్షంలో ప్రతి నీటి బిందువును ఒడిసి çపట్టుకోవాలని, తద్వారా పుడమిని పులకరింప చేయాలన్న తపన, మహోన్నత ఆశయంతో ఆయన పని చేశారు. విజన్ అంటే అదీ. పోలీసులకు క్షమాపణ చెప్పాలి: ఇప్పటివరకు ప్రజలను వేధించిన నీవు, ఇప్పుడు నీ పార్టీ శ్రేణులను హింసిస్తున్నావు. వారిని పోలీసులపైకి ఉసి గొల్పుతున్నావు. బాధ్యత కలిగిన నాయకుడు మాట్లాడే మాటలేనా అవి? నిబంధనలను అతిక్రమిస్తే పోలీసులు ఊరుకుంటారా?. నిన్న టీడీపీ కార్యకర్తలు గుండాల మాదిరిగా వ్యవహరించారు. తమపై లాఠీఛార్జ్ జరిగేలా వారు పోలీసులను రెచ్చగొట్టారు. వారిపై దాడి చేశారు. నిన్ను కాపాడే పోలీసులనే సంఘ విద్రోహ శక్తులని నిందిస్తున్నావు. కాబట్టి పోలీసు శాఖలో ప్రతి ఒక్కరికీ నీవు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నమ్మరు గాక నమ్మరు: నవరత్నాల పాలనతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న సీఎం శ్రీ వైయస్ జగన్‌ను నిందించడం దారుణం. నీ ప్రతి మాట అబద్ధం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను సమూలంగా మారుస్తున్నాం. గ్రామాల్లో విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు రైతుకు ప్రతి అడుగులో భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి. ఏం మాట్లాడినా, ఎంత పిలుపునిచ్చినా ప్రజల నుంచి కనీస స్పందన రాకపోవడంతో, నీ అనుకూల మీడియా ద్వారా అదే పనిగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నావు. అయితే నీవెంత ప్రచారం చేసుకున్నా, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిజంగా నీకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయి చూద్దాం. ఆ దమ్ము, ధైర్యం లేకనే నీవు పవన్‌లో పొత్తు కోసం వెంపర్లాడుతున్నావు. ఇంకా నీ ప్రచార యావ కోసం ప్రజల ప్రాణాలు çఫణంగా పెట్టాలా? ఇంకా ఎందరిని బలి తీసుకుంటావు. ఇప్పటికే 11 మంది నీ ప్రచారయావకు బలయ్యారు. చంద్రబాబూ ఇకనైనా బుద్ధి తెచ్చుకో. వక్రభాష్యాలు. ఉన్మాద ప్రసంగాలు: రాజధానిని వ్యాపారంగా మార్చిన నీవు, నీ అనుయాయులు అక్రమ çసంపాదనకు సాధనంగా మార్చుకున్నారు. అందుకే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామంటే, ఇక్కడ నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తింటుందని గంగ వెర్రులెత్తిపోతున్నావు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా జగన్‌గారిని ఆమోదిస్తుంటే, ఓర్చుకోలేక పోతున్న నీవు, నీ దండుతో బయలుదేరి వక్రభాష్యాలు చెబుతూ ఉన్మాద ప్రసంగాలు చేస్తున్నావు. అలజడి సృష్టించి, లబ్ధి పొందాలని చూస్తున్నావు. తుప్పు పట్టిన సైకిల్ పనికి రాదు.