ముద్రగడ కుటుంబాన్ని టీడీపీ హింసించినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు?  

మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ

తూర్పు గోదావ‌రి:  ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని టీడీపీ ప్రభుత్వం హింసించినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? అని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల‌కృష్ణ‌ నిలదీశారు. గురువారం ఆయ‌న తూర్పు గోదావ‌రి జిల్లాలో మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. ఇప్పుడు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై గ్రాఫిక్స్ చేయిస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు. కాపు రిజర్వేషన్ ఇస్తానని నాడు అల్లర్లుకు కారకుడైన చందబాబు… పవన్‌ కల్యాణ్‌తో జత కడుతున్నారని విమర్శించారు.  చంద్రబాబు మరో ముసుగు వేసుకుని మోసగించడానికి వస్తున్నాడు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాల ప్రజలు తస్మత్ జాగ్రత్త అంటూ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ హెచ్చరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top