ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం

మండలిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

శాసనమండలి: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశామని ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శాసనమండలిలో ఉద్యోగుల సంక్షేమంపై మంత్రి బుగ్గన మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆశా వర్కర్ల జీతం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచామని, పారిశుద్ధ్య కార్మికుల జీతం రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచామని వివరించారు. సీపీఎస్‌ రద్దుపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Back to Top