రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎల్లో మీడియా దుష్ప్రచారం

అసెంబ్లీలో చెప్పిన లెక్కలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

శాసనసభను ఎల్లో మీడియా అవమానపరుస్తోంది

రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: క్రిసిల్‌ రేటింగ్‌ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, రాష్ట్రానికి ఎటువంటి సహాయం అందకూడదని టీడీపీ కుట్ర పన్నుతోందని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ‘‘ఇతర రాష్ట్రాలతో పోలీస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. చంద్రబాబు అప్పులు చేస్తే గొప్ప అన్నట్లు ప్రచారం. ఈ ప్రభుత్వం అప్పు చేస్తే తప్పంటూ దుష్ప్రచారం చేస్తోంది. 2019 మార్చి నాటికి రూ.40,172 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే ప్రస్తుతం రూ.21,673 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు హయాంలోని 20 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు చాలా తక్కువ. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులే చేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ప్రగతి సాధించాం. కోవిడ్‌ సంక్షోభంలోనూ ఏపీలో స్థూల ఉత్పత్తి పెరిగింది. శాసనసభను ఎల్లో మీడియా అవమానపరుస్తోంది. అసెంబ్లీలో చెప్పిన లెక్కలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

 

Back to Top