టీడీపీ సభ్యులపై చ‌ర్య‌లు తీసుకోవాలి

మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

అమ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జ‌రుగ‌కుండా అడ్డుప‌డుతున్న టీడీపీ స‌భ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స్పీక‌ర్‌ను కోరారు. స‌భ మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్‌ తమ్మినేని హామీ ఇచ్చినా.. వాళ్లు ఊరుకోలేదు. ఈ క్రమంలో.. మంత్రి బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. 

తాజా వీడియోలు

Back to Top