వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుంది

మణిపూర్‌ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాం

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: మణిపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చామని విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంకెవరైనా విద్యార్థులు ఉంటే తీసుకువచ్చేందుకు ఏపీ భవన్‌ అధికారులతో టచ్‌లో ఉన్నామని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే వైయస్‌ జగన్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు రైతు యాత్ర పేరుతో తిరుగుతున్నాడన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం రూపొందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందన్నారు.  

Back to Top