చెప్పింది చేయడమే మా ప్రభుత్వ ధ్యేయం

విద్య కోసం రూ.52 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

మూడో విడత అమ్మఒడితో 44 లక్షల మంది తల్లులకు రూ.6,500 కోట్ల లబ్ధి

మ‌హానేత వైయ‌స్ఆర్ స్ఫూర్తితో విద్య‌, వైద్య రంగాల‌పై ప్ర‌ధాన దృష్టి

ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా వాస్తవాలు ప్రజలకు తెలుసు..

విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

శ్రీకాకుళం: చెప్పింది.. చెప్పినట్టుగా నీతిగా, నిజాయితీగా చేయడమే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం తాలూకా ధ్యేయం. సీఎం వైయస్‌ జగన్‌ ఉద్దేశం. గడిచిన మూడేళ్ల పాలనలో విద్యరంగం కోసం రూ.52 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మూడో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, సుమారు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,500 కోట్లు సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా మరికొద్ది క్షణాల్లో జమకానున్నాయన్నారు. పిల్లల చదువుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో అమ్మఒడి మూడో విడత కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. 

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే..
మూడో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 44 లక్షల మంది తల్లులకు సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా రూ.6,500 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. గత ప్రభుత్వాల నాయకులు మాటలు చెప్పారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌.. రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో విద్య, ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. 

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న కానుక, గోరుముద్ద, అమ్మఒడి వంటి కార్యక్రమాలకు ఇవాల్టితో కలుపుకొని రూ.52 వేల కోట్లను ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ చరిత్రలో.. ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున విద్య కోసం నిధులు ఖర్చు చేయలేదు. జగనన్న అమ్మఒడి సీఎం వైయస్‌ జగన్‌ తపన, ఆలోచన. రాష్ట్రంలో నిరక్షరాస్యులు ఉండకూడదని సీఎం ఆలోచన. 

పిల్లలు బాలకార్మికులుగా ఉండకూడదని, అందరూ చదువుకోవాలని విద్య కోసం ఖర్చు చేస్తున్న ప్రతీ రూపాయి కూడా రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడి అనే ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మూడో ఏడాది అమలు చేస్తున్నారు. 

రాష్ట్రంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆయన భాష, ఆలోచన, కార్యక్రమాలు చూస్తే.. విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమైనా సరే.. చాలెంజ్‌గా, ప్రత్యేకమైన ఆలోచనతో, దీర్ఘకాలిక ప్రణాళికతో అమలు చేస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన దక్షతకు, ఆలోచన సరళికి తార్కానం. సుదీర్ఘమైన పాదయాత్ర చేసినప్పుడు దారిపొడవునా.. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా 95 శాతం అమలు చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం. 

మాటిచ్చాం.. మళ్లీ ఎన్నికలప్పుడు చూసుకుంటాం.. పసుపు, కుంకుమ, బెల్లం, కారం ఇచ్చి సరిపెట్టుకుంటామంటే సరిపోదు.. అదికాదు రాజకీయం. మాటిస్తే నెరవేర్చే విధంగా రాజకీయ నాయకుడు ఉండాలని, రాజకీయాలకు సీఎం వైయస్‌ జగన్‌ కొత్త ఒరవడి తీసుకువచ్చారు. ఇవన్నీ వాస్తవాలు. 

44 లక్షల మంది తల్లులు వారి పిల్లలను 75 శాతం హాజరుశాతంతో స్కూలుకు పంపిస్తున్నారో వారందరికీ రూ.6500 కోట్లు అందజేస్తున్నాం. అమ్మఒడికి తూట్లు పొడుస్తున్నారని, మంగళం పాడుతున్నారని, తల్లులను మోసం చేస్తున్నారని కొన్ని పత్రికలు, టీవీలు దుష్ప్రచారం చేశాయి. మీరెన్ని తప్పుడు రాతలు రాసినా, ప్రచారం చేసినా లబ్ధిపొందుతున్న తల్లులకు, బాలబాలికలకు వాస్తవం ఏమిటో తెలుసు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. చెప్పింది, చెప్పినట్టుగా నీతిగా, నిజాయితీగా చేయడమే ఈ ప్రభుత్వం తాలూకా ధ్యేయం. మా నాయకుడి ఉద్దేశం. 
 

Back to Top