47.40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక

మంత్రి బొత్స సత్యనారాయణ
 

కర్నూలు: ఈ ఏడాది 47.40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తున్నట్లు మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..మంత్రి మాటల్లోనే..

ఇవాళ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. గత మూడేళ్లుగా విద్యా రంగానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జగనన్న విద్యా కానుక అందజేస్తున్నారు. ఇవాళ  రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే తల్లిదండ్రులు ఎంతో దిగులుపడేవారు. తమ పిల్లలకు బుక్స్, నోట్స్, యూనిఫాం కొనాలని బాధపడేవారు. ఇబ్బందులు పడే సందర్భాలు చూశాం. కానీ వైయస్‌ జగన్‌ సీఎం కాగానే తల్లిదండ్రులకు అలాంటి ఆందోళనలు వద్దని, ఠీవిగా స్కూల్‌కు వెళ్లాలనే ఉద్దేశంతో జగనన్న కానుక ప్రవేశపెట్టారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలోని విద్యార్థులందరికీ చదువుకునే అవకాశం కల్పించారు. ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ మరో రెండడుగులు ముందుకు వేశారు. అందరూ చదువుకునేలా ఏర్పాటు చేశారు. తనను విద్యాశాఖ మంత్రిగా భాగస్వామ్యం కల్పించడం సంతోషంగా ఉంది. ఇటీవలే అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు.అలాగే బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం. రేపు అక్టోబర్‌ నుంచి సుమారు 4.50 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా లాప్‌టాప్‌లు ఇస్తున్నాం.
విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ప్రతి మండలాన్ని ఒక యూనిట్‌గా చేస్తూ ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు.  47 లక్షల మందికి జగనన్న విద్యా కానుక ఇస్తున్నాం.  సుమారు 5 లక్షల మంది ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ విద్యా, వైద్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎప్పుడు సమీక్ష చేసిన ఏదో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్న సీఎం వైయస్‌ జగన్‌ విధానానికి హ్యాట్సాప్‌ సర్‌. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తీసుకువచ్చారు. ఇవాళ వైయస్‌ జగన్‌ ఒక యజ్ఞం లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున జగనన్న కానుక కార్యక్రమం చేపట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తూ సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రి బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. 
 

Back to Top