మా ప్ర‌భుత్వానికి రైతే వెన్నుముక‌

పేద‌ల‌ను కొట్టి పెద్ద‌ల‌కు పెట్ట‌డ‌మే చంద్ర‌బాబు విధానం

ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని మ‌రింత మెరుగ్గా అమ‌లు చేస్తాం
 
అన‌ధికార క‌నెక్ష‌న్లు రెగ్యుల‌ర్ చేస్తాం

ఐదేళ్ల‌కోసారి ఎన్నిక‌లు జ‌రుగుతాయి

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి రైతే వెన్నెముక అని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ పేర్కొన్నారు. రైతుల‌కు న‌ష్టం క‌లిగించే ఏ ఒక్క కార్య‌క్ర‌మాన్ని కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్ట‌ర‌న్నారు. 
పేద‌ల‌ను కొట్టి పెద్ద‌ల‌కు పెట్ట‌డ‌మే చంద్ర‌బాబు విధాన‌మ‌ని మంత్రి  విమ‌ర్శించారు.  పేద‌ల‌కు మేలు చేయ‌కూడ‌ద‌న్న‌దే చంద్ర‌బాబు స్వ‌భావ‌మ‌న్నారు. ఉచిత విద్యుత్ ప‌థ‌కంలో న‌గ‌దు బ‌దిలీపై చంద్ర‌బాబు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఆయ‌న మాట‌లు ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని ఆయ‌న సూచించారు.  కేంద్ర సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగానే విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు చేశామ‌ని, రైతుకు ఒక్క పైసా కూడా భారం ప‌డ‌ద‌న్నారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శ‌నివారం బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.

చంద్ర‌బాబు రైతు వ్య‌తిరేకి. వ్య‌వ‌సాయం దండ‌గ అన్న వ్య‌క్తి ఆయ‌న‌. ఉచిత విద్యుత్ ఎందుకు, క‌రెంటు తీగ‌ల‌పై బ‌ట్ట‌లు ఆరేసుకోవాల‌ని ఎద్దేవా చేసిన ఘ‌నుడు ఆయ‌న‌. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు రైతుల‌ను మ‌భ్య‌పెట్టేందుకు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితుల‌కు మించి అప్పులు చేశారు. చంద్ర‌బాబు చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు ఈ ప్ర‌భుత్వం క‌డుతోంది. చంద్ర‌బాబు విద్యుత్ రంగాన్నే అమ్మేద్దామ‌నుకున్నాడు. వేల కోట్లు అప్పులు చేశామ‌ని ఆయ‌నే నోటార చెప్పారు. పేద‌ల‌ను కొట్టి పెద్ద‌ల‌కు పెట్ట‌డ‌మే చంద్ర‌బాబు విధానం. ప‌రిశ్ర‌మ‌ల విధానంలో దేశంలోనే ఏపీకి మొద‌టి ర్యాంకు. 

ఉచిత విద్యుత్ ప‌థ‌కంలో న‌గ‌దు బ‌దిలీ కార్య‌క్ర‌మంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచి, అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చించి, అధికారుల‌తో సంప్ర‌దించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగానే విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నాం. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏదైతే మేలు జ‌రుగుతుందో ..దానిపైనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప‌థ‌కంపై కేబినెట్‌లో చ‌ర్చించే స‌మ‌యంలో అధికారులు విశ‌దీక‌రించారు. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌తో ఉచిత విద్యుత్ కోసం న‌గ‌దు బ‌దిలీ కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. ఏదైతే అన‌ధికార క‌నెక్ష‌న్లు ఉన్నాయో..వాటిని కూడా రెగ్యుల‌ర్ చేస్తామ‌ని కేబినెట్‌లో అధికారులు వివ‌ర‌ణ ఇచ్చారు. మీట‌ర్ పెడితే దానికి చార్జీలు ఎవ‌రూ చెల్లించాల‌ని అధికారుల‌ను అడిగితే..ఒక్క పైసా కూడా ఎవ‌రూ చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. డిస్క‌మ్‌లే అన్ని చూసుకుంటాయ‌ని అధికారులు పేర్కొన్నారు. రైతులు కొత్త‌గా ఒక్క‌పైసా కూడా క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు..అన్నీ కూడా ప్ర‌భుత్వ‌మే చూసుకుంటుంద‌ని అధికారులు చెప్పారు. ఆ ప్ర‌కార‌మే ఇవాళ ప్ర‌భుత్వం ఉత్త‌ర్హులు జారీ చేసింది. ఇవ‌న్నీ చూసి చంద్ర‌బాబు కొద్దిగా ఆందోళ‌న చెందారు. అందుకే ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి..న‌గ‌దు బ‌దిలీ కాదు..రైతుల మెడ‌కు ఉరితాడు అంటూ ఆరోపించారు. ఈ న‌గ‌దు బ‌దిలీని చంద్ర‌బాబు 2014కు ముందు ఎంత గొప్ప‌గా చెప్పారో గుర్తు చేసుకోండి. వాళ్ల‌బ్బాయి అమెరికా నుంచి వ‌చ్చి ఈ ప‌థ‌కం గురించి ఎంతో గొప్ప‌గా చెప్పారు. ఇప్పుడేమో అదే న‌గ‌దు బ‌దిలీపై దుష్ప్ర‌చారం చేస్తున్నారు.  మోటార్‌కు అయ్యే ఖ‌ర్చులో రైతులు ఒక్క రూపాయి కూడా క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.

 గ‌తంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉచిత విద్యుత్ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెడ‌తానంటే అప్ప‌ట్లో మేం కాంగ్రెస్‌లో ఉండేవాళ్లం. దీనిపై అధిష్టానాన్ని ఒప్పించి మ‌రీ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. చంద్ర‌బాబు ఉద్దేశం ఏంటంటే..రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వ‌కూడ‌దు. పేద‌ల‌కు చ‌దువు చెప్ప‌కూడ‌దు. ఎవ‌రికి మంచి జ‌రుగ‌కూడ‌ద‌న్న‌దే చంద్ర‌బాబు స్వ‌భావం. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది...ఫ‌లాని కార్య‌క్ర‌మాలు చేయాల‌ని అనుభ‌వం ఉన్న నేత‌గా చంద్ర‌బాబు స‌ల‌హాలు ఇవ్వాల్సింది పోయి ఎప్పుడూ కూడా శాపాలు..అబ‌ద్ధాలే. చంద్ర‌బాబు మ‌న‌సులో ఏమున్నా కూడా..ఆయ‌న ఏం త‌లంచినా కూడా భ‌గ‌వంతుడు పైనున్నాడు. మంచి కోరుకుంటే దేవుడు కూడా మంచే చేస్తాడు. త‌ప్పుగా ఆలోచ‌న చేస్తే.. ఆ దేవుడు కూడా అలాగే శిక్ష విధిస్తారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కూడా ఇదే చెబుతుంటారు. ఆ దేవుడి చ‌ల్ల‌ని దీవేన‌ల‌తో..ప్ర‌జ‌లంద‌రికీ ఆశీస్సుల‌తో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతుంటారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల‌ను క‌చ్చితంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నెర‌వేరుస్తారు. రైతుల‌కు ప‌గ‌డ్బంధీగా ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. రాబోయే 30 ఏళ్ల‌లో రైతుల‌కు ఉచిత విద్యుత్ విష‌యంలో చిన్న ఇబ్బంది కూడా రాకుండా శాశ్వ‌త‌మైన కార్య‌క్ర‌మాల‌ను చేసే దిశ‌గా ఈ ప్ర‌భుత్వం  ముంద‌డుగు వేస్తోంది. చంద్ర‌బాబు ఎన్ని మాయ‌లు చేసినా న‌మ్మే ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేరు. మ‌హానేత వైయ‌స్ఆర్ ఆశ‌యంతో ఉన్న ఈ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు విశ్వాసంతో..న‌మ్మ‌కంతో ఉన్నారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నారు. వేలెత్తి చూపించుకునే ప‌రిస్థితి ఈ ప్ర‌భుత్వానికి రాదు. మా ప్ర‌భుత్వానికి రైతే వెన్నుముక‌. రైతు క‌ళ్ల‌లో ఆనందం కోసం ఈ ప్ర‌భుత్వం ఎందాకైనా ముందుంటుందన్నారు. 

మూడేళ్ల‌కే ఎన్నిక‌ల‌కు ఎందుకు వ‌స్తాయ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ప్ర‌శ్నించారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం ఉంద‌ని, ఐదేళ్లు ఈ ప్ర‌భుత్వం అధికారంలో ఉంటుంద‌న్నారు. వ‌చ్చే ఐదేళ్లు కూడా చంద్ర‌బాబు ఖాళీగానే ఉంటార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ జోస్యం చెప్పారు. ఈ ఐదేళ్ల‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైయ‌స్ఆర్‌సీపీదే అధికారం. మ‌ళ్లీ మ‌ళ్లీ కూడా వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ దీమా వ్య‌క్తం చేశారు. 

 

Back to Top