తాడేపల్లి: ఈఎస్ఐలో జరిగిన రూ.150 కోట్ల అవినీతిలో చంద్రబాబు, లోకేష్‌కు వాటా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అచ్చెన్నాయుడిని కలవాలంటే ఎవరైనా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. ఈఎస్ఐలో అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. అరెస్టు అన్యాయమని మాట్లాడితే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.