మహానేత అంటే విపక్ష సభ్యులకు ఎందుకంత భయం?

శాసన మండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ

రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వమే కారణం

ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది

అమరావతి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అంటే విపక్ష సభ్యులకు ఎందుకంత భయమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వమే కారణమని, ఏ రైతు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.  రైతుల సంక్షేమం గురించి శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా మండలి చైర్మన్‌ పదే పదే మైక్‌ కట్‌ చేయడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.  
టీడీపీ సభ్యులకు కలలో కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహానేత అంటే విపక్ష సభ్యులకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ సకాలంలో అందాలన్నారు.  రైతుకు భరోసా కలగాలంటే, వారికి ధైర్యం రావాలంటే ఈ సభ ద్వారానే చెప్పాలన్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అధికమిస్తామన్నారు.

ఈ ప్రభుత్వం మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనలతో పుట్టిందని, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి ఆశయంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఏ రైతు కూడా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతేడాది రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరికీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వమే కారణమని తెలిపారు. ఏ ఒక్కరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని, సభ్యులందరూ కూడా రైతులకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, పంటలకు ఇన్స్‌రెన్సు ఇస్తుందని, రైతు భరోసా కింద రూ.12,500 ప్రతి ఏటా ఇస్తుందని చెప్పాలని సూచించారు. 

 

Back to Top