రైతు సంక్షేమానికి పెద్దపీట

రైతులు మోసపోకూడదనే ప్రభుత్వ ధ్యేయం

రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌

వ్యవసాయ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ

 

అమరావతిః రైతు సంక్షేమానికి వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం  పెద్దపీట వేస్తుందని మంత్రి బొత్స నారాయణ అన్నారు.  రైతులు మోసపోకూడదనే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు.రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు.  బడ్జెట్‌ వివరాలు ఆయన మాటల్లోనే..
 మన రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం,అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.అవకాశాలు మెండుగా ఉండే వ్యవసాయం  రంగం అభివృద్ధికి శ్రద్ధ చూపుతూ ప్రపంచానికి పటెడ్డన్నం పెట్టే రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతం. దానికి అనుగుణంగా రైతు సంక్షేమం, వ్యవసాయం రంగం రెండు కళ్లుగా భావించి ఏపీలో దేశ చిత్రపటంలో పస్పుటంగా కనబడే విధంగా ప్రణాళిక బద్దంగా మందుకు సాగిపోవడం  జరుగుతుంది.రైతాంగానికి తాత్కాలిక ఉపశమనం కలిగించడమే కాదు.దీర్గకాలికంగా మేలు చేసే విధంగా సాగుతున్నాం. వ్యవసాయ రంగ బడ్జెట్‌ మొత్తం 28,866.23 కోట్లతో  ప్రవేశపెడుతున్నాం.రైతు సంక్షేమ ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  అధికారం చేపట్టిన వెంటనే ప్రకటించారు.రాష్ట్రంలో రైతు సంక్షేమం మాట వింటే రైతు బాంధవుడిగా పేరుపొందిన వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకువస్తారు.ఆయన  స్ఫూర్తితో రైతు సంక్షేమానికి అంకితమవుతున్నాం.వైయస్‌ జగన్‌ 3,648  కిలోమీటర్ల పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో రైతులు పడుతున్న కన్నీళ్లు చూశారు..బాధలు విన్నారు.ప్రత్యేక చూసి చలించారు.రైతులకు భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు.వైయస్‌ఆర్‌సీపీ మ్యానిఫెస్టోను ఒక బైబిల్,ఖురాన్,భగవద్గీతగా భావించి అమలు చేయడమే దిశగా ముందుకు కదులుతున్నాం.ఈ ప్రభుత్వం మాట ప్రభుత్వం కాదు..మాటల ప్రభుత్వం..
రైతులకు పెట్టుబడి సాయంః
వ్యవసాయం పెట్టుబడులు కోసం రైతులు అప్పులపాలు కాకూడదని భావించి ప్రతి సంవత్సరం మే నెలలో ఒకొక్క రైతు కుటుంబానికి రైతు భరోసా పథకం కింద 12,500 రూపాయల  చొప్పున సాయం అందిస్తుందన్నారు.ఈ పథకాన్ని వచ్చే ఏడాది  మే నెల నుంచి అమలు చేయాలని నిర్ణయించినప్పుటికి రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరమే అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.ఈ పథకం ద్వారా 64.05 లక్షల రైతు కుటుంబాలు మేలు జరుగుతుంది. వీరిలో 15.37 లక్షల కౌలు రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.బడ్జెట్‌లో 8,750 కోట్లు ప్రతిపాదించడం జరిగిందన్నారు. కౌలు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఎంతో మంది కౌలు రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.విప్తతులు వచ్చినప్పుడు ఎటువంటి సాయం లేక..బ్యాంకుల నుంచి రుణాలు రాక అనేక ఇబ్బందులను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు.గత టీడీపీ ప్రభుత్వం కౌలు రైతులకు  మేలు చేయడంలో,ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయింది.వారికి ఇతర రైతులతో పాటు ప్రభుత్వపరంగా సాయం అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది.భూ యాజమనుల హక్కులకు విఘాతం కలుగకుండా కౌలు చట్టంలో సమూల మార్పులు తీసుకురావడానికి సంకల్పించాం.కౌలు రైతులకు పంట హక్కును కల్పిస్తూ..పట్టాదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌలు ప్రతాన్ని తీసుకురావాలని భావిస్తున్నాం.దీంతో ప్రభుత్వ రాయితీలు, సాయం కౌలురైతులకు అందించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.
వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమా పథకంః
రైతులపై పంట బీమా  ప్రీమియం భారం పడకుండా ఉండేందుకు వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమా పథకం తీసుకురావడం జరిగింది.అన్ని పంటలకు రైతులు చెల్సించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది.దీంతో ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టం వస్తే పరిహారం పొందుతారు. దీని కోసం బడ్జెట్‌లో 1163 కోట్లు ప్రతిపాదించారు.
రైతులకు వడ్డీలేని రుణాలుః
రైతులు భారంతో కుంగిపోకూడదని, వారి ఆదుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన.రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రతి రైతుకు వడ్డీలేని పంట రుణాలు ఇస్తూ..కౌలు రైతులు తీసుకున్న పంటరుణాలకు కూడా ఇది వర్తిస్తుంది.సున్నా వడ్డీతో పంట రుణాలు ఇవ్వడం రైతులకు పెద్ద ఊరట అని ప్రభుత్వం భావిస్తోంది.రైతులు పంటరుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తే  లక్ష రూపాయల లోపు పంట రుణాల వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది. ఆత్మహత్యలు పాల్పడిన రైతుల కుటుంబాలు రోడ్డున పడకుండా 7 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వ నిర్ణయించింది.దీని కోసం బడ్జెట్‌ 100 కోట్లు ప్రతిపాదించాం. రైతులు పండించిన  పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చినప్పుడే ఈ రంగం మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుంది.పంట దిగుబడి వచ్చి చేతికి వచ్చే సమయంలో ధరలు పడిపోయి దిక్కుతోచని స్థితిలో రైతులు పంటను తక్కువ ధరకు అమ్ముకోవడం చూస్తున్నాం.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బడ్జెట్‌లో 3వేల కోట్ల ప్రతిపాదించడం జరిగింది.సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధ్యక్షతన అగ్రికల్చర్‌ మిషన్‌ ఏర్పాటు చేశారు.ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను సమీక్షిస్తూ రైతు సమస్యలను పరిష్కరించడానికి ఈ మిషన్‌ పనిచేస్తోంది.ప్రతి నెల ఒక సమావేశం నిర్వహిస్తాం.ధరల స్థిరికరణనిధి, ప్రకృతి విపత్తుల నివారణ నిధిని ఏవిధంగా కేటాయించాలో ఈ మిషన్‌ నిర్ణయిస్తుంది.రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ప్రకృతి విపత్తుల మూలంగా  నాశనం అవుతున్నాయి. సన్నకారు,చిన్నకారు రైతుల జీవితాలు ఛిద్రమవుతున్నాయి.రైతులను సకాలంలో ఆదుకోవాలని ప్రకృతి విప్తతుల సహాయ నిధిని ఏర్పాటు చేశాం.దీని కోసం బడ్జెట్‌లో రూ.2002 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ప్రకృతి విపత్తుల సహాయ నిధిని వేరే అవసరాలకు మళ్లీంచం. రాష్ట్రంలో ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో వ్యవసాయ రంగం ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఆహార పంటలు, ధాన్య పంటలు,అపరాలు పంట విస్తీర్ణం పెంచుకుంటూ పంటల దిగుబడి పెంచి  అభివృద్ధి చేయడానికి  జాతీయ ఆహార భద్రత మిషన్‌ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. బడ్జెట్‌లో 141.26 కోట్లు ప్రతిపాదించాం. ఏ రంగం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు చాలా ముఖ్యం. ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రీయ వికాస యోజన పథకం ద్వారా అన్ని అవకాశాలను సద్వివినియోగించుకుంటాం.ఈ పథకం అమలు కోసం  341 కోట్లు బడ్జెట్‌ ప్రతిపాదించడం జరిగింది. రైతులు పండించిన పంటలు  ఆశించిన దిగుబడులు పొందాలంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి.రైతులకు సకాలంలో రాయితీలు, నాణ్యమైన విత్తనాలు అందిస్తాం.కల్తీ విత్తనాల సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటాం.చట్టాలు కఠినతరం చేస్తాం. నాణ్యమైన విత్తన సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఎరువులు,పురుగు మందులకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తాం. రైతులకు రాయితీ విత్తనాలు నిమిత్తం బడ్జెట్‌లో 200 కోట్లు  ప్రతిపాదించాం. పట్టు పరిశ్రమకు బడ్జెట్‌ రూ.158 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయ ఆధునికీకరణకు రూ.460  కోట్లు బడ్జెట్‌ ప్రతిపాదించాం.పశు సంవర్థక శాఖకు రూ.1240 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయ అనుబంధం రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు,వరద నివారణకు రూ.13,139 కోట్లు కేటాయించాం. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ,4525 కోట్లు కేటాయించాం.
వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా...
2019–20లో రైతులకు దీర్ఘ కాలిక రుణాలు కింద రూ.1500 కోట్లు
ఉద్యాన శాఖకు రూ.15,32 కోట్లు
ఆయిల్‌ పాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు రూ.80 కోట్లు
ఆయిల్‌ ఫాం తోట సాగు ప్రోత్సాహానికి రూ.65.15 కోట్లు
ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధికి రూ.200 కోట్లు 
రైతులకు తుంపర,బిందు సేద్య పథకాల కోసం రూ.1105.55 కోట్లు
సహకార రంగ అభివృద్ధి కోసం రెవెన్యూ వ్యయం రూ.174.64 కోట్లు 
సహకార రంగ అభివృద్ది కోసం పెట్టుబడి వ్యయం రూ.60 కోట్లు
2019–20 రైతులకు స్వల్పకాలిక రుణాల కింద రూ.12వేల కోట్లు

రైతులకు 9 గంటలకు ఉచిత విద్యుత్‌కు రూ.4,525 కోట్లు
ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీకి రూ.475 కోట్లు
రైతుల ఉచిత బోర్లకు రూ.200 కోట్లు
భూసార పరీక్ష నిర్వహణకు రూ.30 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.420 కోట్లు
పోలం పిలుస్తోది..పోలం బడికి రూ.89 కోట్లు
జీరో బడ్జెట్‌ వ్యవసాయానికి రూ.91 కోట్లు 
వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు రూ.3,223 కోట్లు

 

Back to Top