సందేహాలుంటే మేనిఫెస్టో చూసుకోండి

ప్రతిపక్ష సభ్యులకు మంత్రి బొత్స సూచన

 

వెలగపూడి: ప్రస్తుతం ఉన్న పింఛన్‌ వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని, అవ్వాతాతలకు పింఛన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని, ప్రతిపక్షాలకు సందేహాలు ఉంటే వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో చూసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. దివ్యాంగుల పెన్షన్‌ రూ. 3 వేలు ఇస్తామని, మేనిఫెస్టోలో లేని అంశం కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు, కుటుంబంలో ఒక్కరికే పెన్షన్‌ ఇచ్చేవారని, ఇప్పుడు అర్హులందరికీ ఇవ్వాలని చర్చ జరగుతుందని, త్వరలోనే దాన్ని కూడా అమలు చేస్తామన్నారు. భగవద్గీత లాంటి మేనిఫెస్టోలోని అంశాలను వక్రీకరిస్తున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ రెండు పేజీల మేనిఫెస్టోను ఐదేళ్లలో అమలు చేస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top