కనిగిరి, దర్శిలలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు

విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

ప్రకాశం: రైతుల సంక్షేమం కోసం ఏం చేయడానికైనా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం చొరవతో రైతులకు ఉచితంగా పగటిపూటనే 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. రైతుల బాగు కోసం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగులు వేస్తున్నారన్నారు. రైతుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఫ్యాక్టరీల పరిస్థితిపై కమిటీలు వేశామని, కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. ఒంగోలు భగీరథపై కూడా కమిటీ విచారణ చేస్తోందన్నారు. 

కనిగిరి, దర్శిలలో 2 వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మార్కాపురం మెడికల్‌ కాలేజీ, రామాయపట్నం పోర్టు, నిమ్స్‌ వంటి భారీ ప్రాజెక్టులు త్వరలో అమలు చేయబోతున్నామన్నారు. చంద్రబాబు తన పాలనలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయకుండా పర్సంటేజ్‌ల కోసం టీడీపీ నేతలు కక్కుర్తిపడ్డారన్నారు. 
 

Back to Top