చంద్ర‌బాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా? 

 మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి సూటి ప్ర‌శ్న‌
 

ప్రకాశం:  2014 ఎన్నికల స‌మ‌యంలో చంద్ర‌బాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా అని మంత్రి బాలినేనిశ్రీ‌నివాస‌రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. చంద్రబాబు ఎలా అబద్దాలు చెబుతాడో నారా లోకేష్ కూడా అలాగే అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఓటీఎస్ ప‌థ‌కంపై టీడీపీ నేత‌లు, ఎల్లోమీడియా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా  ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 2014–2019 మధ్య  చంద్ర‌బాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఓటీఎస్‌ వడ్డీని చెల్లించాలని ఐదుసార్లు అధికారులు ప్రతిపాదనలు పెడితే..కనీసం ఆ వడ్డీని కూడా ఎందుకు మాఫీ చేయలేదు బాబూ ? అని మంత్రి నిల‌దీశారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top