ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌

టీడీపీకి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు

జనసేనకు ఒక సీటు కూడా రాదు

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ ఆసరా రెండో విడత కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వైయస్‌ఆర్‌సీపీకి ప్రకాశం జిల్లాలో మెజారిటీ ఇచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లాలో అభివృద్ధి శూన్యమన్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లాకు ఒక్క నిర్ధిష్టమైన పని కూడా చేయలేదని, టీడీపీ నేతలు చంద్రబాబుకు లేఖలు రాయాలని, గత ఐదేళ్లు మీరు ఏమీ చేయలేదని, ప్రజలు మమ్మల్ని తిరగనివ్వడం లేదని చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. జనసేన అధ్యక్షుడు నిజంగా మగాడైతే ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పని చేశారు..అలాంటి వ్యక్తి ఇవాళ ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నారు. సిగ్గుపడాలి. మా నాయకుడు పులి..పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే వస్తున్నారు. సింహాం సింగిల్‌..పందులే గుంపులుగా వస్తాయని ఎద్దేవా చేశారు. మా ఒంగోలు పట్టణంలో మంచినీటి సమస్య ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం వైయస్‌ జగన్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top