‘విశాఖ ఉక్కు’ను కాపాడుకుంటాం

రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని నిర్ణయం

మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్, నాగిరెడ్డి, ఎంపీ ఎంవీవీ

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు పోరాడుతామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. కేంద్రం తీసుకున్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ బాలచెరువు రోడ్‌ వద్ద అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నేతలు నిరసన సభ చేపట్టారు. నిరసన సభకు వైయస్‌ఆర్‌ సీపీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిరసనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకుంటామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని నిర్ణయం ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని, ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు పోరాడుతామన్నారు. 
 

Back to Top