స్పీచ్‌లతో పనులు కావని పవన్‌ తెలుసుకోవాలి

జేసీ మాదిరిగా డబ్బు ఉన్నవాళ్లు రాయలసీమలో లేరు

మంత్రి అవంతి శ్రీనివాస్‌

కర్నూలు: పవన్‌కు గ్రామ సచివాలయాల గురించి తెలియకపోతే జనసేన నాయకులనే అడిగి తెలుసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఉద్దానం, విజయనగరం వెళ్లి పవన్ స్పీచ్‌లు ఇచ్చారని, స్పీచ్‌లతో పనులు కావని పవన్‌ తెలుసుకోవాలన్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందాయని, అక్కడి ప్రజలకు డబ్బులున్నాయని, భూములున్నాయని చెప్పారు. వారి పిల్లలు అమెరికాలో చదువుతున్నారని గుర్తు చేశారు.  ఎవరికైన కష్టం వస్తే అమెరికా నుంచి ఫండ్స్‌ వస్తాయన్నారు. రాయలసీమలో చాలా మంది పేదలున్నారని చెప్పారు. జేసీ దివాకర్‌రెడ్డి లాగా డబ్బులున్నవారు లేరన్నారు.

Back to Top