టీడీపీ నేతలు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారు

సంక్షేమ పథకాలే వైయస్‌ఆర్‌ సీపీని గెలిపిస్తాయి

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

నెల్లూరు: ప్రభుత్వం పనితీరు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరని ఈ విషయం తెలియక ఆ పార్టీ నేతలు ఇంకా భ్రమల్లో బతుకుతున్నారన్నారు. నెల్లూరులో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీలు సింహాలో లేక గుంటనక్కలో ఉప ఎన్నికలో తిరుపతి ప్రజలే తేలుస్తారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు గొ్రరెలంటూ అచ్చెన్నాయుడు నోరుపారేసుకోవడం సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. ప్యాకేజీకి కక్కుర్తిపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన నీచ చరిత్ర టీడీపీదని ధ్వజమెత్తారు. కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటే, ఆ స్కూళ్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top