టీడీపీ వాళ్లే అరాచకాలు చేస్తూ నిందలు తమపై వేయడం సిగ్గుచేటు

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

 నెల్లూరు: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వాళ్లే అరాచకాలు చేస్తూ నిందలు తమపై వేయడం సిగ్గుచేటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. టీడీపీనే అడ్డదారులు తొక్కుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వయానా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆయన ధ్వ‌జ‌మెత్తారు. 

మూన్నాళ్లు వుండే ఓ వ్యక్తి అండ చూసుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారని.. పల్లెలు ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదని మంత్రి అనిల్ ఆరోపించారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా.. పంచాయితీ ఎన్నికల్లో 90 శాతం పైగా గెలుపు వైయ‌స్ఆర్‌సీపీదేనని మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top