వైయస్ జగన్ అవినీతి లేని పారదర్శక పాలన చేస్తున్నారు

మంత్రి అనిల్ కుమార్ యాదవ్

మా ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోంది. దేశంలో అతి పెద్ద వ్యాధి కరెప్షన్. సీఎంగా జగన్ అధికారం చేపట్టగానే ప్రతి పనిలో ఓ జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండాలని భావించారు. ఈ విషయాన్ని ప్రమాణ స్వీకారంరోజే చెప్పారు. ఒక నాయకుడికి, ఓ ముఖ్యమంత్రికి అతి కష్టమైన, ప్రమాదకరమైన సంగతి కరెప్షన్ మీద ఉక్కు పాదం మొపడం. అది తీసుకోవాలంటే ఒక ధైర్యం, హానెస్టీ, చిత్తశుద్ధి ఉండాలి.
గత ఆరునెలల చర్యలు చూసినా, సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా సంచలనాలకు వేదికౌతున్నాయి. గత ప్రభుత్వంలో వేల కోట్ల వర్కులు, టెండరింగ్ విధానంలో ఎక్సెస్ రేట్లతో కట్టబెట్టారు. ఇలాంటి అవినీతిని అరికట్టడానికి 10లక్షలు దాటిన ప్రతి పనీ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని, 10కోట్లు దాటిన ప్రతి పనీ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలనీ నిర్ణయించారు. ఇందుకోసం రిటైర్డ్ జడ్జ్ పి.శివశంకర్ రావుగారిని నియమించి ప్రతి పనీ పారద్శకంగా జరిగేలా చేసారు.
రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపుగా 1400 కోట్లు ఈ ప్రభుత్వం ఆదా చేసింది. పోలవరంలో టన్నెల్ లో మాక్స్ ఇన్ఫ్రా కంపెనీ 230కోట్ల వర్కులో దాదాపు 55 కోట్లు ఆదా అయ్యింది. గతంలో 4% ఎక్సెస్ తో వచ్చింది.
ప్రజల జీవనాడి అని చెప్పుకునే పోలవరంలో 750 కోట్ల రూపాయిలు ఆదా చేసాం.
550 కోట్ల విలువైన పనులు జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్ట్ లో రివర్స్ టెండింగ్ ద్వారా 67 కోట్లు మిగుల్చుకున్నాం.
రెండు రోజుల క్రితం మా స్వంత జిల్లాలో ఆల్తూరు పాడురిజర్వాయిర్ కు రివర్స్ టెండరింగ్ కు పిలిస్తే 250 కోట్ల వర్క్ దక్కించుకున్న HCS కంపెనీ 26% తగ్గించుకుని కోట్ చేసింది. దీనివల్ల దాదాపు 68 కోట్లు ప్రజాధనం ఆదా అయ్యింది.
4 హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి 700 కోట్ల రూపాయిలకు గతంలో ఇచ్చిన వర్క్ పై రివర్స్ టెండరింగ్ కు వెళ్లగా 105 కోట్లు ఆదా అయ్యాయి.
వెలిగొండ రిత్విక్ 6.5 పర్సెంట్ తగ్గింది

ఇవి రివర్స్ టెండరింగ్ లు కావు రిజర్వ్‌డ్‌ టెండరింగ్‌లు అని ప్రతిపక్షంవాళ్లు అన్నారు. దానిపై కూడా నేను సమాధానం ఇస్తున్నా.
ఎవరికైతే గతంలో చంద్రబాబు ఎక్సెస్ కు ప్రాజెక్టులు కట్టబెట్టారో వాళ్లే మళ్లీ దాదాపు 15% నుంచి 25% దాకా లెస్ చేసుకుని రివర్స్ టెండర్లో పాల్గొంటున్నారు. సీఎం వైయస్ జగన్ చిత్తశుద్ధితో రివర్స్ టెండరింగ్ కు వెళ్లబట్టే 5000 కోట్ల రూపాయిల ప్రాజెక్టుల్లోనే 1400 కోట్లు మిగుల్చుకోగలిగాం. ఒకవేళ ఇదే చేయకపోతే ఈ 1400 కోట్లూ ఎవరి జేబులోకి వెళ్లేవి? పెదబాబా? చినబాబా? ఈ అసెంబ్లీలో ఛాలెంజ్ లు చేసి ఇప్పుడు మళ్లీ లోపల కాలుపెట్టలేక బయటుండిపోయిన మరో బాబు జేబులోకి పోయేవా చెప్పాలి!
ఇవే 1400 కోట్లు ఉపయోగించి 20 లక్షలమంది అగ్రిగోల్డు బాధితుల కుటుంబాల్లో సంతోషాలు నింపచ్చు.
ఇవే 1400 కోట్లు వినియోగించి లక్షలాది రైతులకు భరోసా అందించొచ్చు.
ఇవే 1400 కోట్లతో అమ్మ ఒడి ద్వారా ఇరవై లక్షల మంది లబ్ది పొందచ్చు.
కేవలం ఆరేడు మంది జేబుల్లోకి డబ్బులు నింపి, వారి నుంచి డబ్బులు దండుకుంది గత ప్రభుత్వం. నీరు చెట్టు పేరుతో 20,000 కోట్లు ఖర్చు చేసారు. ఇరిగేషన్, ప్రాజెక్టులు, మున్సిపాలిటీ, పంచాయితీరాజ్ ఇలా ఎందులో చూసినా గత ప్రభుత్వం దోచుకున్నదే కనిపిస్తోంది. ఏ పని ముట్టుకుని చూసినా మాకెంత మీకెంత పద్ధితిలో పనిచేసారని తెలుస్తోంది.
రివర్స్ టెండరింగ్ ద్వారానే కాదు కరప్షన్ పైనా  ముఖ్యమంత్రి ఉక్కుపాదం మోపారు. ఐఎఎస్, ఐపీఎస్ లతో జరిగిన తొలి కాన్ఫరెన్స్ లోనే అవినీతిపై క్లియర్ గా ఆదేశించారు. మా పార్టీకే చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా సరే వారి కరెప్షన్ కి సహకరించక్కర్లేదు, చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్సులో మా కార్యకర్తలను కాపాడండి, మా నాయకులను బాగా చూసుకోండని చెప్పాడు. అవినీతి చేస్తే అది సొంత పార్టీ మంత్రులైనా సరే పీకి పారేస్తానని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఇదీ చంద్రబాబుకూ జగన్ కు మధ్య ఉన్న బేధం. ఇలాంటి ముఖ్యమంత్రి మావాడని, ఇలాంటి నాయకుడి సారధ్యంలో మంత్రిగా పని చేస్తున్నామని ఎంతో గర్వంగా చెబుతున్నా. ఆరు నెలల మా ముఖ్యమంత్రి పాలనలో కరప్షన్ అలిగేషన్ పెట్టడానికి దమ్ము కూడా అవతలున్న ప్రతిపక్షానికి లేదంటే మా నాయకుడి పాలన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 14400 కాల్ సెంటర్ తీసుకొచ్చి అవినీతిపై యుద్ధం చేస్తున్నది వైయస్ జగన్. గతంలో బాబు జన్మభూమి కమిటీలు పెట్టి పింఛన్, ఇల్లు, లోను ఏది కావాలన్నా లంచానికి డిమాండ్ చేసారు. అలా చేయబట్టే నేడు ఆ పార్టీ 23కు పరిమితం అయ్యింది.
ఇలాంటివి జరగకూడదనే ప్రతి పథకం పేదవాడికి చేరాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి, సచివాలయాల ద్వారా అవినీతికి తావులేని ట్రాన్సపరెంట్ గా పనిచేసే వ్యవస్థను తెచ్చారు.
14400కి కాల్ చేస్తే డేటా సిస్టంలోకి వస్తుంది. ఆ జిల్లాకు సంబంధించి ఏసీబీ అధికారులకు చేరుతంది. 15 రోజుల్లోపే దానిపై విచారణ జరిపి న్యాయం చేయడం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ తో ఒప్పందం కుదుర్చుకుని అన్ని శాఖల్లో కింది స్థాయి నుంచి అవినీతి అవకాశం ఉన్న అంశాలను గుర్తించి రిపోర్టు ఇవ్వడం ఈ ఒప్పందంలో ప్రధాన భాగం. ఆ రిపోర్టు ద్వారా కరెప్షన్ ను సాధ్యమైనంత తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుంది.
కరప్షన్ మీద, రాజకీయనాయకుడిగా, ముఖ్యమంత్రిగా మంచి మార్పును తెచ్చిన కథలతో వచ్చిన సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. ప్రజలంతా ఈ లంచం ఎప్పుడు పోతుంది, ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడు? సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఇలాంటి మార్పులు జరుగుతాయా అన్న అనుమానంలో ఉన్నారు. గొప్ప నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి వస్తాడా వస్తాడా అని కలలు కంటూ ఉన్నారు. సినిమాల్లో వాళ్లు చూసినటువంటి ముఖ్యమంత్రిని భగవంతుడు జగన్ మోహన్ రెడ్డి రూపంలో పంపిస్తాడని ఎవ్వరూ అనుకుని ఉండరు.
పేదపిల్లల చదువుల బాధ్యత తీసుకుని వారి తల్లలులకు  15000 ఇస్తాడని ఎవ్వరూ అనుకుని ఉండరు.
ఆడపిల్లపై చెయ్యేస్తే తాటతీసే ముఖ్యమంత్రి వస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.
అవినీతి జరిగితే అంతుచూసే సీఎంను చూస్తామని ప్రజలెప్పుడూ అనుకుని ఉండరు.
అత్యాచార ఘటనలు జరిగినప్పుడు అదిచేస్తాం ఇదిచేస్తాం అని కబుర్లు చెప్పేవాళ్లు బోళ్లుమంది ఉంటారు. కానీ ఆచరించి చూపే దమ్ము ఒక్క వైయస్ జగన్ మోహన రెడ్డికి మాత్రమే ఉంది. ఎవ్వడైనా సరే రేప్ చేస్తే ఉరేయమని చట్టం తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. తన తండ్రి వైయస్సార్ రెండడుగులు వేస్తే తాను 4 అడుగులు ముందుకేస్తానని జగన్ చెబుతూ ఉంటారు. నాలుగడుగులు కాదు 100 అడుగులు కాదు లెక్కపెట్టుకోలేనన్ని అడుగులు ఆయన ముందుకు వేస్తున్నారని సగర్వంగా చెబుతున్నా.
కోట్లాది మంది ప్రజల సంతోషాలను చూడ్డానికి మా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు మా శాసన సభ్యులు, మంత్రులం అందరం అండగా ఉంటాం. ఆయన ఆశయాల వెన్నంటి నడుస్తాం.   

   

Read Also: దిశ చట్టం దేశానికే ఆదర్శం 

తాజా వీడియోలు

Back to Top