బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్!

 మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

తాడేప‌ల్లి:  స్కిల్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు అయ్యింది. నాలుగు వారాల పాటు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. నవంబర్‌ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు తీర్పు ఇచ్చింది. మ‌ధ్యంత‌ర బెయిల్‌పై మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. నిజం గెలిచి కాదు..చంద్ర‌బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.

Back to Top