సున్నా(టీడీపీ)+సున్నా(జనసేన) కలిస్తే ఫలితం సున్నానే 

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు 

 మోస్ట్‌ ఇమ్మోరల్‌, అన్‌లయబుల్‌ ఫెలో పవన్‌ కల్యాణ్ 
 
పవన్ జనసేన ప్రాణం తీస్తాడేమో కానీ...టీడీపీకి ప్రాణం పోయలేడు*: మంత్రి అంబటి రాంబాబు

 చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే నువ్వు జగన్‌ గారిని విమర్శించేవాడివా? 
 
భయాన్ని పరిచయం చేస్తానన్న వాడికి భయమంటే ఏంటో చూపించాడు.  

 నన్నేం పీకారు అని విర్రవీగే బాబును దేవుడు జైల్లో పెట్టాడు. 
 
పవన్‌కి మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ అని ఎప్పుడో చెప్పా 
 
పవన్‌కి జగన్‌ గారి మానసిక స్థితి గురించి మాట్లాడే అర్హత లేదు. 

ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావు..? అది నీ మానసిక పరిస్థితికి నిదర్శనం కాదా? 
 
సత్తా లేనివాడికే ఇలాంటి మాటలు వస్తాయి .
 
జనసేన, టీడీపీ పొత్తును జనసైనికులే ఆహ్వానించడం లేదు . 
 
వాళ్లు ఎన్ని సీట్లు ఇస్తారు...వాటిలో నువ్వు ఎన్ని గెలుచుకుంటావ్‌..? : మంత్రి అంబటి రాంబాబు 

 రాజకీయాల్లో, వ్యక్తిగతంగానూ నీకు నైతిక విలువలు లేవు 

 నువ్వు ఎన్డీయేలో ఉన్నావా లేక బయటకు వచ్చావా? 
 
రిలీజ్‌ కాకుండానే పొత్తు సినిమా సూపర్‌ హిట్‌ అయ్యిందా? 
 
పవన్‌ చివరి కోరిక చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే. : మంత్రి  అంబటి రాంబాబు

తాడేప‌ల్లి:  సున్నా(టీడీపీ)+సున్నా(జనసేన) కలిస్తే ఫలితం సున్నానే అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.  చంద్రబాబు అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైళ్లో ఉన్న తర్వాత టీడీపీ తాబేదార్లు, వారి మీడియా, దత్తపుత్రుడు ఇది అన్యాయం, అక్రమమని, కేవలం కక్షతోనే ఆయన్ను అరెస్ట్‌ చేసిందని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. 
వారి కుటుంబ సభ్యులు లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణలు కూడా ఏదో ఉద్యయం చేయాలనే ప్రయత్నం చేశారు. 
ఆయన ఎంత దుర్మార్గుడైనా, ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డా అది రక్తసంబంధం కాబట్టి సహజం. 
రక్త సంబంధీకులు పెద్ద ఎత్తున ఆందోళన చెందితే..వారి కన్నా ఎక్కువగా రక్తసంబంధం లేని వ్యక్తులు కొంత మంది గగ్గోలు పెడుతున్నారు. 
ఆయనెవరో కాదు...మాది ఒక ప్రత్యేక పార్టీ అనిచెప్పుకుంటున్నా పవన్‌ కల్యాణ్‌. 
ఆయన చాలా గందరగోళానికి గురవుతున్నారు. వారి కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. 
చంద్రబాబు కుమారుడు రోడ్డు మీద కూర్చుంటే...పవన్‌ కల్యాణ్‌ ఏకంగా రోడ్డుపై పడుకుని దొర్లాడాడు. 
పవన్‌ కల్యాణ్‌ను నమ్ముకుని పనిచేస్తున్న జనసైనికులు, వీరమహిళలు ఆలోచన చేయాలని నేను కోరుతున్నా. 
నిన్న సర్వసభ్య సమావేశాన్ని కూడా పెట్టారు. పవన్, నాదెండ్ల సుధీర్ఘమైన ఉపన్యాసం కూడా ఇచ్చారు. 
నిన్నటి సమావేశంలో నాదెండ్ల మనోహర్‌ ఒక తీర్మానాన్ని కూడా చేశారు...
పవన్‌ వెంట మనోహర్‌ ఐదేళ్ల నుంచి నడుస్తున్నట్లున్నాడు...
ఈ ఐదేళ్లుగా ఈ తీర్మానం కోసమే ఆయన కాసుకుని ఉన్నాడు. అవకాశం వచ్చి తీర్మానాన్ని చదివేశాడు. 
చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటూ పొత్తు ప్రకటించాడు. 
ఇది ఆ పార్టీ నాయకులను, క్యాడర్‌ను మోసం చేసే మాట ఇది. 
మీ ఇద్దరు కలిసే వస్తారని, కలిసే రావాలని మేం ఎన్నో ఏళ్లుగా చెప్తున్నాం. 
పొత్తు ప్రకటించే ముందు ఒక వైపు బాలకృష్ణ, మరో వైపు లోకేశ్‌ మధ్య నిల్చుని ప్రకటించడానికి కారణం జగన్‌ నువ్వే అన్నాడు. 
వారిద్దరి మధ్యన నిలబడటం జనసైనికులు అంగీకరించరని, అలా పొత్తు ప్రకటించడానికి కారణం జగన్‌ గారేనని చూపించి జనసైనికులును మోసం చేయాలని ప్రయత్నంచేశాడు. 

 రాబోయే కాలంలో అది నిరూపితం అవుతుంది:*
వైయ‌స్ఆర్‌సీపీ  విముక్త ఆంధ్రప్రదేశ్‌ను సృష్టించడమే వారి కోరికట. దాని కోసమే కలిశారట. 
రెండంకెలు కలిస్తే కొత్త అంకె వస్తుంది..రెండు సున్నాలు కలిస్తే ఏమొస్తుంది..ఇంకో సున్నా వస్తుంది. రాబోయే కాలంలో మీరే చూడబోతున్నారు. 
మోస్ట్‌ ఇమ్మోరల్‌ ఫెలో, మోస్ట్‌ అన్‌లయబుల్‌ ఫెలో పవన్‌ కల్యాణ్‌...చంద్రబాబు కూడా కాదు. 
బీజేపీతో నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకున్నావో నీకు తెలుసా..? 
ఎవరైనా ఎన్నికలప్పుడు పొత్తులు పెట్టుకుంటారు. కానీ ఈయన ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నాడు. 
ఇప్పటికీ ఎన్డీయేలో కొనసాగుతున్నావు. ఒక్క పార్లమెంటు, అసెంబ్లీ సీటు లేకపోయినా నువ్వు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నావు. 
మొన్న ఎన్డీయే సమావేశానికి కూడా వెళ్లి మోడీగారితో ఫోటో దిగివచ్చావు. 
చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నాడా..? ఇండియా టీమ్‌లో ఉన్నాడా..? 
ఎక్కడా లేడు...గోడమీద పిల్లిలా ఉన్నాడు. 
నువ్వు చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ముందు నీకు నైతిక విలువలు ఉంటే నువ్వు ముందు ఎన్డీయేతో సంప్రదించాలి. 
లేదంటే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలి. 
ఇప్పుడెళ్లి మోడీ, అమిత్‌షాలతో సంప్రదిస్తాడట. 
రాజకీయాల్లో నీకు నైతిక విలువలు లేవు...వ్యక్తిగతంగానూ నీకు నైతిక విలువలు లేవు. 
ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటావు...మరొక పార్టీతో చేతులు కలుపుతుంటావు. 
నిజ జీవితంలోనూ ఒకరితో పెళ్లి చేసుకుంటావు..సంసారం చేస్తుంటావు...మరొకరితో ఇల్లీగల్‌ కాంటాక్ట్‌లోకి వెళ్తుంటావు. 
ఇవాళ అదే కార్యక్రమాన్ని రాజకీయాల్లోనూ చేస్తున్నావు. 
అందుకే రాజకీయాల్లో మోస్ట్‌ ఇమ్మోరల్‌ ఫెలో పవన్‌ కల్యాణ్‌. 

*రిలీజ్‌ కాకుండానే పొత్తు సినిమా సూపర్‌ హిట్‌ అయ్యిందా?:*
ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటారో తెలియని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 
జనసైనికులు, వీరమహిళలకు నేను ఒకటే చెప్తున్నా...
పొత్తు సూపర్‌ హిట్‌ అట. జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు మిళితమై పోయారట. 
రిలీజ్‌ కాకుండానే ఈ పొత్తు సినిమా సూపర్‌ హిట్‌ అయిపోయిందట. 
మీ సినిమా అట్టర్‌ ప్లాప్‌.
జనసైనికులంతా మా పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నారు. 
ముఖ్యమంత్రి కావడానికి నువ్వు ఏమన్నా సిద్ధంగా ఉన్నావా అంటే లేదు. 
నా అంతిమ కోరిక ముఖ్యమంత్రి పదవి కాదు అంటాడు. ఆయన చివరి కోరిక చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడం. కానీ సాద్యం కాదు. 
పొత్తు నిర్ణయం ద్వారా జనసేన పార్టీ ప్రాణం తీశావు...టీడీపీకి ప్రాణం పోయాలని ప్రయత్నం చేస్తున్నావు. 
నువ్వు జనసేన పార్టీ ప్రాణం తీయగలవేమో కానీ..టీడీపీకి ప్రాణం పోయడం నీవల్ల కాదు. 
వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ని సృష్టించడం కూడా నీవల్ల కాదు.

*బాబు హాయంలో కాపు ఉద్యమకారుల్ని అదే జైళ్లో పెట్టారు..కనీసం పలకరించావా?:*
నిన్న చాలా మితిమీరి మాట్లాడాడు. తెలంగాణ సరిహద్దులో నన్ను బందిచే ప్రయత్నం చేశారన్నాడు. 
వీరోచితంగా నేను తిరిగి వచ్చాను...ఈ రాష్ట్రానికి రావాలంటే పాస్‌పోర్ట్‌ కావాలా అన్నాడు. 
కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీసు శాఖ తీసుకునే నిర్ణయాలు అవి. 
అసలు పవన్‌ కల్యాణ్‌ నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నావా..?
జగన్‌ గారు కొవ్వొత్తుల ప్రదర్శనకు వైజాగ్‌ వెళ్లారు. మేం దిగకముందే పోలీసుల రన్‌వే మీదకి వచ్చి మమ్మల్ని అరెస్ట్‌ చేసే ప్రయత్నంచేశారు. 
కొవ్వొత్తుల ప్రదర్శనకు వెళితేనే మమ్మల్ని తిప్పి పంపించారు. 
ఆ రోజు నువ్వేమయ్యావ్‌..ఆ రోజు చంద్రబాబు చేసింది రైటా? అదేంటని నవ్వేమన్నా మాట్లాడావా? 
ఒక విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వొచ్చి ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తే నిన్ను తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. 
కానీ తిరిగి పంపలేదు...జాగ్రత్తగా తీసుకొచ్చి నీ ఆఫీసులో దించారు. 
దీనికే పాస్‌పోర్టు కావాలా అంటూ గందరగోళం చేసే ప్రయత్నం చేశాడు. 
రాజమండ్రి వెళ్లావు..బ్రహ్మాండంగా చంద్రబాబును పలకరించావు...బయటకి వచ్చి పొత్తు ప్రకటించావు కదా.?
చంద్రబాబు హయాంలో కూడా రాజమండ్రి జైళ్లో కాపు ఉద్యమకారులని పెట్టారు కదా..? పలకరించావా..? కనీసం ఖండించావా? 
ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి మ్యాన్‌ హ్యాండిల్‌ చేసి వారి కుటుంబాన్ని దూషించి గందరగోళం చేసినప్పుడు పలకరించావా? 
పలకరించకపోతే సరే...కనీసం ఖండించావా? 
చంద్రబాబు దారుణాలు, అన్యాయాలు చేస్తే నువ్వు ఖండించవు. 
మేం అన్యాయాలు, అక్రమాలు చేయకపోయినా ఖండిస్తావ్‌..బట్టలు చించుకుంటావ్‌. 

*పరిణామాలు ఆలోచించుకునే నీ బతుకెంత అన్నావా..?:*
నీ బతుకేంటి...నీ స్థాయి ఏంటి అంటూ మైకు దొరికింది కదా అని రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నావే..పరిణామాలను ఆలోచించుకున్నావా..? 
ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి..ప్రజాదరణ కలిగిన వ్యక్తి. 
175 సీట్లలో 151 సీట్లు గెలుచుకున్న ధీరుడైన వైఎస్సార్‌ కుమారుడు. 
నీ బతుకేంటి..నీ స్థాయి ఏంటి..? రెండు చోట్ల నిలబడితే రెండు చోట్లా ఓడిపోయావే..? 
ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే నువ్వు జగన్మోహన్‌రెడ్డి గారి గురించి మాట్లాడతావా? భగవంతుడున్నాడు జాగ్రత్త. 
లోకేశ్‌ తన యువగళంలో భయాన్ని జగన్‌కు పరిచయం చేస్తా అన్నాడు...నేడు ఆయనకు భగవంతుడే భయాన్ని పరిచయం చేశాడు. 
చంద్రబాబు కూడా అంతే..రాజశేఖరరెడ్డే ఏం చేయలేకపోయాడు...ఈ నాలుగేళ్లలో నన్నేం పీకారు అన్నాడు. 
భగవంతుడు విన్నాడు..రెండు పీకి సెంట్రల్‌ జైళ్లో పెట్టాడు. 
వాళ్లకన్నా పెద్ద మగోడివా నువ్వు. 
భయాన్ని పరిచయం చేస్తా అన్నవాడు భయపడి చస్తున్నాడు..నన్నేం పీకారు అన్నవాడిని పీకి జైళ్లో పెట్టారు. 
భగవంతుడు నీకు కూడా ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సింది ఇస్తాడని మర్చిపోవద్దు. 
జగన్‌ గారి మానసిక పరిస్థితి గురించి మాట్లాడతాడు..అసలు నీ మానసిక పరిస్థితి ఏంటి..? 
మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ఉన్న వ్యక్తివి నువ్వు. ఎప్పుడేం మాట్లాడతావో నీకే తెలియదు. 
నీ మానసిక పరిస్థితి ఏంటి..? ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావు..? అది నీ మానసిక పరిస్థితికి నిదర్శనం కాదా? 
ఎవరితో ఉంటావో కూడా తెలియని నువ్వు జగన్‌ గారి మానసిక పరిస్థితి గురించి మాట్లాడతావా? 
సత్తా లేనివాడికే ఇలాంటి మాటలు వస్తాయి. నీ దగ్గర నిజంగా సత్తా ఉంటే నువ్వు రాజకీయాల్లో పనికి వస్తావు..
కానీ రాజకీయాల్లో పనికి రాని వ్యక్తి కొణిదెల పవన్‌ కల్యాణ్‌. 
మనోహర్‌ కొంగుపట్టుకుని వెళ్తున్నాడు..డైరెక్ట్‌గా సముద్రంలోకి వెళ్తాడు. 

*ఎక్కడుంది సింపతీ..ఎక్కడుంది వేవ్‌..?:*
సింపతీ వేవ్‌లో జగన్‌ గారు కొట్టుకుపోతాడు అంటున్నారు. 
ఎక్కడుంది సింపతీ..ఎక్కడుంది వేవ్‌..? 
బ్రాహ్మణి గారి మాటలను నేను ఖండించదలుచుకోలేదు. 
ఎందుకంటే ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన భర్తనే ఆరాధించిన హిందూ స్త్రీ, భర్త రాక్షసుడైనా ప్రేమించాలనే హిందూ దేశం ఇది. 
ఒకటైతే వాస్తవం. నారా చంద్రబాబునాయుడు తప్పు చేశాడు. 
ఇల్లీగల్‌ మనీని కాజేశాడు. ఆయన్ను చట్టప్రకారం శిక్షించాల్సిందే. 
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయ కక్షలకు దీనిలో తావే లేదు. 
ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్‌ చేసి ఆయనకు సింపతీ ఇచ్చేంత తెలివి తక్కువ వాళ్లం కాదు మేము. 
చట్టం తన పని తాను చేసుకుంటూ పోయే క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి. 
అక్రమంగా చంద్రబాబును అరెస్ట్‌ చేశారు అనేవారికి నిదానంగానైనా వాస్తవాలు తెలుస్తాయి. 

*పొత్తును జనసైనికులే ఆహ్వానించడం లేదు:*
జనసేన, టీడీపీ పొత్తులను తటస్థులు కూడా ఆహ్వానించడం కాదు..జనసైనికులే ఆహ్వానించడం లేదు. 
వాళ్లంతా మా పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలి అంటున్నారు. 
ఈయనేమో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రే అప్పుడు తేల్చుకుందాం అంటున్నాడు. 
ముందు జగన్‌ దించేయాలి అంటున్నాడు. 
పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ఆ సైనికులను మోసం చేస్తావ్‌...నువ్వా ముఖ్యమంత్రి..? 
వాళ్లు ఎన్ని సీట్లు ఇస్తారు...వాటిలో నువ్వు ఎన్ని తెచ్చుకుంటావ్‌..? 
వాళ్ల దగ్గర పడి వాళ్ల కాళ్లు పిసికే కార్యక్రమం చేస్తున్నావ్‌...జనసైనికులు, వీరమహిళలు అందుకు సిద్ధంగా లేరు. 
నీ పక్షాన ఉన్నవారు, నీ అభివృద్ధిని కోరుకునే వారు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా లేరు. 
రాసిపెట్టుకోండి...అట్టర్‌ ఫ్లాప్‌ కాకపోతే అప్పుడు నన్ను అడగండి. 
వాళ్లు కలిసి రావాలనే మా కోరిక..కలిసి వస్తేనే వాళ్లు మా శక్తి ఏంటో చూస్తారు. కలిసికట్టుగా విసిరి బంగాళాఖాతంలో వేస్తాం. 
నేరం చేసిన వాడు అనుభవించక తప్పదు...అతన్ని సపోర్ట్‌ చేసిన వాడు ఆ నేరంలో భాగస్వామి అవుతాడు. 
ఈ సారి జనసేన అసెంబ్లీకి వెళ్తుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. 
జనసేన అసెంబ్లీకి వెళ్లడం కోసమా నువ్వు ఇన్ని తంటాలు పడుతుంది..? 
మీ అమాయక సైనికులు మాత్రం అధికారంలోకి వస్తుందని కోరుకుంటున్నారు. 
పవన్‌ కల్యాణ్‌ సింగిల్‌గా వెళ్లడం ఇష్టం లేకే ఓడిపోయాడట. ఏం భయమా..? 
నీ గోల్‌ అసెంబ్లీకి వెళ్లడమేనా..? అదేం కాదు...చచ్చిపోతున్న టీడీపీకి ప్రాణం పోయాలని నీ గోల్‌. 
టీడీపీ ఆత్మహత్య చేసుకుంటోంది అన్న విషయం నీకు అర్ధం కావడం లేదు..నువ్వు కూడా వారితో వెళ్లి ఆత్మహత్య చేసుకో. 
మనోహర్‌కి అవకాశం దొరికింది...కలిపేశాడు..ఇక మార్గమే లేదు. 

*పవన్‌కు రాజకీయ నైతికత లేదు..వ్యక్తిగత నైతికత అంతకన్నా లేదు:*
ఈ దేశంలో బీజేపీ పెద్ద పార్టీనా.? జనసేన పెద్ద పార్టీనా..? 
ఈయన పొత్తు పెట్టుకున్నాక ఇప్పుడు వెళ్లి మాట్లాడతాడట...వాళ్లు ఒప్పుకుంటారట..!
బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని..వెళ్లి అమిత్‌షా, మోడీని ఒప్పించేంత శక్తివంతుడా..? 
ఇది రాజకీయ నైతికత కాదు...అతనికి వ్యక్తిగత నైతికతే లేదు. 
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. 
కారణం ఒక్కటే...ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమాన్ని అమలు చేసిన ప్రభుత్వం జగన్‌ గారిది. ప్రజలంతా మా పక్షాన ఉన్నారు. 
చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే కృత్రిమ ఉద్యమాలు కూడా రావడం లేదు..
చంద్రబాబును అరెస్ట్‌ చేయడంపై ప్రజలకు ఆశ్చర్యం వేసింది తప్ప సానుభూతి లేదు. 
ఈ దొంగ సామాన్యమైన దొంగకాదే...ఈ దొంగ దొరకడే అని ప్రజలు ఆశ్చర్యపోయారు. 
దొరకని దొంగను కూడా పట్టుకున్నాడనేదే జగన్‌ గారి ప్రభుత్వానికున్న క్రేజ్‌. 
దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకోలవాలని చూస్తున్నారు. ఒక్క పవన్‌ తప్ప కలిసే వారు ఎవరూ లేరు. 
ఈయనతో కలిస్తే వాళ్లు మునిగిపోతారని వాళ్లకి తెలుసు. 

తాజా వీడియోలు

Back to Top