చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్‌ షో

ఆంబోతులకు ఆవులను సప్లయ్‌ చేయడమే బాబు రాజకీయం

అధికారం కోసం ఎవడి చంకబడితే వాడి చంక నాకే రాజకీయ సైకో చంద్రబాబు

చంద్రబాబు ఒక ముసలి సైకో.. బాబును మించిన సైకో ఎవరూ లేరు

చంద్రబాబు ఆయన తమ్ముడికి మధ్య ఉన్న చిదంబర రహస్యం ఏంటీ..?

కోడెల శివప్రసాద్‌ మరణానికి చంద్రబాబే కారణం

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశావా..?

చంద్రబాబు తెలివితక్కువతనం వల్లే పోలవరం కుంటుపడింది

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

గుంటూరు: చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని, 20 వేల కెపాసిటీ ఉన్న గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభకు కనీసం 3 వేల మంది కూడా రాలేదని, దాన్ని కప్పిపుచ్చేందుకు పచ్చ పత్రికలు, ఎల్లో ఛానల్స్‌ అద్భుతమంటూ అసత్య కథనాలు వండివార్చాయని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి సభలో చంద్రబాబు ఒక్క నిజమైన చెబుతాడేమోనని ఎదురుచూశానని, తనకు ఆశాభంగం కలిగిందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నిజం చెబితే చంద్రబాబు శిరస్సు వెయ్యి ముక్కలు అపోయిందనే ఒక ముని శాపం ఉందని, అందువల్లే చంద్రబాబు జీవితంలో నిజం చెప్పడని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు సభకు సంబంధించిన గ్రౌండ్‌ను, జనాలే ఏ మేరకు సభకు హాజరయ్యారో మంత్రి అంబటి రాంబాబు వీడియోలు ప్రదర్శించి వివరించారు. 

సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి ఇంకా ఏం మాట్లాడారంటే.. 

చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్‌ షో.. సత్తెనపల్లిలో టీడీపీ టికెట్‌ ఆశించే వ్యక్తులందరూ కష్టపడి పోగుచేసినా కనీసం 3 వేల మంది జనం కూడా రాలేదు. 
చంద్రబాబు సభకు పోలీసులు పర్మిషన్‌ ఇచ్చిన గ్రౌండ్‌లో 20 వేల మంది పాల్గొనవచ్చు. కానీ హాజరైంది కనీసం 3 వేలమంది కూడా లేరు. సభ ఏ విధంగా సక్కెస్‌ అయ్యిందో ఎల్లో మీడియాకు, చంద్రబాబుకే తెలియాలి.

సీఎం వైయస్‌ జగన్‌ను చంద్రబాబు ఎలా దూషించాడో ప్రజలంతా విన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రాజకీయాలకు అనర్హుడు అని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌లో పుట్టి, కాంగ్రెస్‌లో పెరిగి.. మామ పెట్టిన పార్టీలో చేరి ఆ పార్టీని లాక్కొని, ఆ పార్టీ ద్వారానే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాజకీయాలకు అర్హుడా..? ఆయన కొడుకు అర్హుడా..? కానీ, తండ్రి చనిపోయిన తరువాత తన రెక్కల కష్టంతో పార్టీ పెట్టి, దేశంలోనే యోధులని చెప్పుకునేవారిని ఎదిరించి, పార్టీని నిలబెట్టుకొని 151 సీట్లు గెలుచుకున్న వైయస్‌ జగన్‌ అనర్హుడా..? చంద్రబాబుకు పూర్తిగా మతిచెడిపోయిందా..?

చంద్రబాబు ముసలివాడు కాదా..? ముసలివాడిని ముసలోడు అంటే అంత బాధ ఎందుకు..? ఎవడి చంకబడితే వాడి చంక నాకే రాజకీయ సైకో చంద్రబాబు. ఎందుకంటే.. మోడీని తిడతాడు. అమిత్‌షా వస్తే రాళ్లు వేయించాడు. బీజేపీని సర్వనాశనం చేస్తానని దేశంలోని రాష్ట్రాలన్నీ తిరిగాడు. మళ్లీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని అవసరమైతే మోడీ కాళ్లు పట్టుకుంటానని చెబుతున్నాడు. అధికారం కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుది. చంద్రబాబు కంటే సైకో ఈ రాష్ట్రం ఎవరు లేరు. చంద్రబాబు ఒక ముసలి సైకో. 

రూ. 2 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌.. రాజకీయాలకు అనర్హుడా..? పేదవారిని ధనవంతులను చేయడానికి చంద్రబాబు వద్ద మంత్రం ఉందంట.. అదేంటో అర్థం కావడం లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి పేదలను ఎవరిని ధనవంతులను చేశావ్‌.. నీ అబ్బాయిని, నీ కుటుంబంలో ఉన్నవారిని, నీకు సంబంధించిన వ్యక్తులను ధనవంతులను చేశావ్‌ కానీ, ఒక్క పేదవాడిని ధనవంతుడిని చేసిన సంఘటన ఉందా..? 

చంద్రబాబు కంటే ముందు నుంచి టీడీపీలో ఉన్న నాయకుడు స్వర్గీయ కోడెల శివప్రసాదరావు. కోడెల శివప్రసాద్‌ మా రాజకీయ ప్రత్యర్థి. ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి.. ప్రజలు ఫిర్యాదులు ఇచ్చారు. దాన్ని చట్టపరంగా కేసు రిజిస్టర్‌ చేసి చర్యలు తీసుకునే ప్రయత్నం చేశాం. తప్పు చేసిన వారిపై విచారణ జరపడం అన్యాయామా..? ఆ కేసులకు భయపడి కోడెల చనిపోయాడని చంద్రబాబు పచ్చి అబద్ధం చెబుతున్నాడు. కేసులు పెడితే చనిపోయేంత పిరికివ్యక్తి కోడెల కాదు. ఆయన ఉరి వేసుకోవడానికి ప్రధాన కారణం నారా చంద్రబాబు. మత్తుమాత్రలు మింగి మరణించాలని నిర్ణయించుకొని సేవ్‌ అయ్యాడు. కోడెలను పరామర్శిస్తే బాగుంటుందని కొందరు నేతలు చంద్రబాబుకు చెబితే.. ఆ దుర్మార్గుడిని నేను పరామర్శించను అని చంద్రబాబు అన్నాడు. అది తెలుసుకున్న తరువాత పార్టీ సపోర్టు లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యకు నూటికి నూరుశాతం చంద్రబాబే కారణమని సత్తెనపల్లి మొత్తం తెలుసు. 

కోడెల కుటుంబం మీద చంద్రబాబుకు ప్రేమ ఉంటే.. టికెట్‌ ఎవరికి ఇస్తాడో మరికొద్ది రోజుల్లోనే ప్రజలంతా చూస్తారు. కోడెల కుటుంబాన్ని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. 

చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఆంబోతులకు ఆవులకు సప్లయ్‌ చేయడం తప్ప ఏమైనా ఉందా..? చంద్రబాబు అసలు ప్రజాదరణ ఉన్న నాయకుడేనా.. గుండె మీద చెయ్యి వేసుకొని చెబుతున్నా.. చంద్రబాబు, ఆయన కొడుకు, కోడెల శివప్రసాద్‌ కంటే వందరెట్ల నీతిమంతుడిని. ఎవరికీ అన్యాయం జరగకూడదని భావించే వ్యక్తిని నేను. మొన్నటి వరకు ఉన్న నా తమ్ముడు కనిపించడం లేదని చంద్రబాబు అంటున్నాడు. నా తమ్ముడు ఎన్నికల సమయంలో వచ్చి నాకు సహాయంగా ఉన్నాడు. మళ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి వస్తారు. ఎందుకంటే నేను అన్ని ఇళ్లు తిరగలేను కాబట్టి.. నా వాళ్లంతా వచ్చి ప్రచారం చేస్తారు. ఇంతకుముందులా కుటుంబ సభ్యులు దోచుకోవడానికి అంబటి రాంబాబు అంగీకరించడని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. 

చంద్రబాబు ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడికి మధ్య ఉన్న చిదంబర రహస్యం ఏంటో చెప్పు. నీ తమ్ముడు ఎమ్మెల్యేగా చేశాడు, నీకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో చేరాడు.. ఏంటా చిదంబర రహస్యం చంద్రబాబు చెప్పాలి.

పోలవరం డయాఫ్రం వాల్‌ అంటే ఏంటో నాకు తెలియదని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు చేసిన తెలివితక్కువతనం వల్ల పోలవరం ప్రాజెక్టు కుంటుపడింది. దీనిపై చర్చ జరగాలి. డయాఫ్రం వాల్‌ ప్రధాన ఆనకట్టకు పునాదిలాంటిది.. భూమిలో ఉంటుంది. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం లేకుండా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారు. దాని వల్ల వరదలు వచ్చి కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ల నుంచి డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది. దీని మీద రెండు సంవత్సరాలు రీసెర్చ్‌ చేసి కొట్టుకుపోయిందాన్ని పరిష్కరించాలంటే రూ.2022 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చంద్రబాబు తప్పిదం వల్లే జరిగింది. 
 

Back to Top