బాబు వ్యూహం ఫలించింది కుట్రల్లోనే

ఎమ్మెల్యేలను కొనడాన్ని వ్యూహమంటారా బాబూ..? 

 నలుగురు ఎమ్మెల్యేలను కొంటే టీడీపీ బలం పెరిగినట్టా.!?

 ఎమ్మెల్యేల కొనుగోలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య 

  21 స్థానాలలో 4 ఎమ్మెల్సీలు గెలిస్తే టీడీపీ బలం పెరిగినట్టా..?

  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు సూటి ప్రశ్నలు

 కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్‌ ‘చంద్రబాబు’

 టీడీపీ అప్రజాస్వామిక విధానాలతో 9 రోజులపాటు అసెంబ్లీని అగౌరపరిచారు..

  సభలో టీడీపీ గందరగోళాన్ని ప్రజలంతా చూశారు

  బాయ్‌కాట్‌ పేరిట అసెంబ్లీ బయటకొచ్చి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కసరత్తు చేశారు

 దుయ్యబట్టిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు

 సంఖ్యాబలం ఉంది కనుకే మేం 7 స్థానాలకు పోటీచేశాం..

 టీడీపీ మాత్రం ప్రలోభాల కుట్రలు జరిగాకే ఆలస్యంగా బరిలోకి దిగింది

 రూ.10 నుంచి రూ.20 కోట్లు ఆశచూపి మా ఎమ్మెల్యేల్ని కొన్నారు

 సంతలో పశువుల్లా.. అంగట్లో సరుకులా ఎమ్మెల్యేల్ని కొంటారా బాబూ..?

  రేపు 175 స్థానాల్లో కొంటామంటే ప్రజలు తిరగబడతారు

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి   అంబటి రాంబాబు స్పష్టీకరణ

ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తారా..? 

  అందుకే వెన్నుపోటు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు 

 ఆ నలుగురి ద్రోహాన్ని సమాజం కూడా క్షమించదు

 హెచ్చరించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు 

 అమ‌రావ‌తి:  తొమ్మిదిరోజులపాటు జరిగిన శాసనసభ  సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీరు చాలా అప్రజాస్వామికంగా ఉంద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. గౌరవ గవర్నర్‌ గారి స్పీచ్‌ జరిగిన రోజు కూడా ఆపార్టీ సభ్యులు మధ్యలో బాయ్‌కాట్‌ చేసి అరుస్తూ, పేపర్లు చించి వెళ్లిపోయారు. ఆ తర్వాత గవర్నర్‌ గారికే ముఖ్యమంత్రి గారు సరైన గౌరవం ఇవ్వలేదంటూ ఒక విషప్రచారాన్ని ఎల్లో పత్రికల్లో రాయించి జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలంతా వీటన్నింటినీ గమనించాలి. శాసన సభ సమావేశాలు జరిగినన్ని రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ వారు సస్పెండ్‌ కాకుండా లేరు. ప్రతీరోజు సభకు రావడం, సభను ఆటంకపరచడం, సస్పెండై వెళ్లడం అనేది ఆపార్టీ ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుంది. దాన్ని ఈ తొమ్మిదిరోజులపాటు నిత్యకృత్యంగా వారు అమలు చేశారు. మరీ, చిత్రమైన విషయమేంటంటే.. కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో వారిని సస్పెండ్‌ చేయడం ఆలస్యమైతే వారు భరించలేకపోయారు. ఆ భరించలేనితనంతో స్పీకర్‌ పోడియం ఎక్కారు. పోడియం వెల్‌లోకి వెళ్లారు. గౌరవ స్పీకర్‌ గారి పక్కన చేరి అల్లరి అల్లరి చేశారు. ఆయన మీద కాగితాలు చింపి వేస్తూ .. ఒకదశలో భౌతికదాడికి పాల్పడే ప్రయత్నానికి ఒడిగట్టి అప్రజాస్వామిక విధానంతో టీడీపీ వారు వ్యవహరించారు. చంద్రబాబు సూచనమేరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎంత గందరగోళం సృష్టించారనేది ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా చూశారు. 

చంద్రబాబు డైరెక్షన్‌తోనే సభలో గందరగోళం. :
చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో శాసనసభలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. దీనికి డైరెక్షన్‌ చంద్రబాబే.. ఆయన తన పార్టీ ఆఫీసులో కూర్చొని ..‘నేను శాసనసభను బాయ్‌కాట్‌ చేశాను కాబట్టి మిగతా వారు కూడా అక్కడ గందరగోళం చేసి బయటకు రావాలే తప్ప శాసనసభను ఎట్టిపరిస్థితుల్లో గౌరవించేదే లేదు..’ అనే పద్ధతుల్లో వ్యవహరించాడు. ఇటువంటి నీచమైన, దుర్మార్గమైన చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను. 

బాయ్‌కాట్‌ పేరిట బయట కుట్రలు, కుతంత్రాలుః
బాయ్‌కాట్‌లతో అసెంబ్లీ బయటకు వెళ్లగానే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏంచేశారంటే.. కుట్రలు, కుతంత్రాలు పన్నారు.. ‘అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు కొందాం.. ఎలా ప్రలోభాలు చూపి బేరాలాడి కొందాం.. ’అనే వ్యూహాత్మక కుట్రల కార్యక్రమాలకే ఈ తొమ్మిది రోజులూ వెచ్చించారు. 

ప్రలోభాలపై పట్టు కుదిరిన తర్వాతే బరిలోకొచ్చారు.:
వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా మేం 7 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీకి పెడితే.. తెలుగుదేశం నేతలు మాత్రం బేరాలాడి..ప్రలోభపెట్టి మా పార్టీ నుంచి నలుగురు వస్తారనే ఆలోచనతో.. కాస్త ఆలస్యంగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలోకి దింపారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే.:
ఇలాంటి లోపాయికారీ మభ్యపెట్టే పనులతో, ఎమ్మెల్యేలను కొనడం, వాస్తవాల్ని తారుమారు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యనే కనుక.. ఇప్పుడు కూడా అదే అప్రజాస్వామిక కుట్రలకు పాల్పడ్డారు. ఆయనెప్పుడు అధికారాన్ని చెలాయించినా కుట్రలు, కుతంత్రాలతోనే చెలాయించారు. తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేక్రమంలో చంద్రబాబు బహిరంగంగా దొరికిపోయిన ఘటన ఉభయ రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు స్వభావం తెలుసు కనుకనే మేం కూడా మా ఎమ్మెల్యేలను జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నించాం. ఒకరిద్దరు అనుమానమున్న ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాం. సరే, వారంతా నాటకమాడారు. ఆ తర్వాత తెలిసిందేంటయ్యా అంటే, ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.10 నుంచి రూ.20కోట్లు వరకు డబ్బు ముట్టజెప్పారని... ఆ ప్రకారంగా నాలుగు ఓట్లు వేయించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోగలిగారు.

ఫలించింది వ్యూహం కాదు.. చంద్రబాబు కుట్రః
 సరే, అడ్డదారిలో గెలిపించుకున్నారనుకుంటే.. ఆహా మేం గెలిచాం.. మా పార్టీకి చాలా బలం పెరిగిందని చాలా ఆనందపడిపోతున్నారు. నలుగురు ఎమ్మెల్యేల్ని కొంటే పార్టీకి బలం పెరిగిద్దా..? బాహుబలి పార్టీ అవుతుందా..?  ఎందుకంటే, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఎల్లోమీడియా ఉంది కనుక.. విపరీతమైన ప్రచారం చేసుకోవడంలో ఆశ్చర్యమేమీలేదు. చంద్రబాబు వ్యూహం ఫలించిందని మీడియాలో రాయించుకోవడం కాదు. చంద్రబాబు కుట్ర ఫలించిందని రాయించుకోవాలి. ఎల్లోమీడియా పత్రికలు, ఛానెళ్లు ఆ విధంగా రాసుకోవాలి. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడాన్ని వ్యూహమంటారా..? 

ఆ ఎమ్మెల్యేలది శునకానందమే.:
చంద్రబాబు ప్రలోభాలకు తలొగ్గి ఆయన వలలో పడతారని అనుమానం ఉన్న కొందరు ఎమ్మెల్యేలను పిలిపించి మేం కూడా మాట్లాడాము. మీరు సపోర్టు చేస్తున్నందున చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలోకి దింపాడని అడిగాం.. కానీ అంగట్లో సరుకులా.. పశువుల సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలు అమ్ముడుబోయి చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించి ఒక శునకానందాన్ని అనుభవిస్తున్నారు. 

175 చోట్ల చంద్రబాబుకు ప్రజలే బుద్ధిచెబుతారుః
ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోగానే చంద్రబాబుకు విక్టరీ వచ్చిందని రెండు వేళ్లు పైకెత్తి చూపుతున్నాడు .. శాసనమండలిలో మొత్తం 21 మందిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవడానికి అవకాశమొస్తే.. కుట్రలు, కుతంత్రాలు, డబ్బుల ప్రలోభాలు పెట్టి కేవలం నాలుగు స్థానాలు టీడీపీ వాళ్లు గెలిచారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీ నాలుగు ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో బతికిపోయామని చంకలు గుద్దుకుంటుంది. మేం అధికారంలోకి వస్తాం.. అంటూ ఎగిరి గంతులేయడం కాదు. ఏదో డబ్బులు పడేసి నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్ని కొనేశాం అనుకుంటే.. రేపు సాధారణ ఎన్నికల్లో 175 స్థానాల్లో కుట్రలు, కుతంత్రాలు చేసి గెలుస్తామంటే ప్రజలు ఊరుకుంటారా..? చంద్రబాబు గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపినక్రమంలో కూడా చాలామందిని ప్రలోభపెట్టారు. ఆ తర్వాత ఆ ప్రలోభాలకు ఆకర్షితులైన వారందర్నీ గంగలో ముంచారనేది అందరికీ తెలిసిందే.. 

పార్టీ గీత దాటితే సస్పెన్షనే.. ఇది వైఎస్‌ఆర్‌సీపీ విధానంః
ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించడానికి ఎవరైతే ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రలోభాలకు తలొగ్గారో.. రేపు వారంతట వారే బయటకొచ్చి మాకు ఇంతిస్తామని ఇంతే ఇచ్చారు. ఫలానా పదవి అని చెప్పి మోసం చేశారంటూ చెబుతారు. ఇది భవిష్యత్తులో జరగబోయే సత్యం. 
ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చంద్రబాబు కుట్రలో బలిపశువుల్లా మారి ప్రలోభాలకు గురై వారి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించారంటే మిమ్మల్ని సమాజం కూడా క్షమించడానికి వీల్లేదు. వారిని ప్రజలు ఆదరించరు. వారికి నైతిక విలువల్లేవు. జగన్‌మోహన్‌రెడ్డి గారి పట్ల గౌరవం, ఇష్టం లేకుంటే రాజీనామా చేసి బయటకు వెళ్లేవారు. ఓటును అమ్ముకున్న దుర్మార్గులు వారు కనుకనే వైఎస్‌ఆర్‌సీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇదే విధంగా పార్టీ లైన్‌ దాటితే.. వెన్నుపోటు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వైయ‌స్‌ఆర్‌సీపీ ఏమాత్రం వెనుకంజ వేయదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీగా మా విధానం ఇదని అంబ‌టి రాంబాబు గర్వంగా తెలిపారు. 

Back to Top