స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదు

మంత్రి అంబటి రాంబాబు

అమ‌రావ‌తి:  అసెంబ్లీలో స్పీక‌ర్‌పై వివ‌క్ష స‌భ్యులు పేప‌ర్లు విస‌ర‌డం మ‌ర్యాద‌కాద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. ఇలాంటి చ‌ర్య‌లు ప్ర‌జ‌లు హ‌ర్షించ‌ర‌న్నారు. స్పీకర్‌పై టీడీపీ సభ్యుల వ్యవహారశైలిని మంత్రి ఖండించారు. మంగ‌ళ‌వారం రెండో రోజు స‌మావేశాల్లో స్పీక‌ర్‌పై పేపర్లు చింపి వేశారు. ఈ ఘ‌ట‌న‌పై మంత్రి స‌భ‌లో మాట్లాడారు. వివ‌క్ష స‌భ్యులు పేప‌ర్లు విసిరి వేస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారని త‌ప్పుప‌ట్టారు. మీరు సభా సంప్రదాయాను తప్పుతున్నారు. ఇది మర్యాద కాద‌ని మంత్రి హిత‌వు ప‌లికారు. మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో.. లేదో తేల్చుకోండి అంటూ సూచించారు. ఇలా ప్రతీసారి సభను అడ్డుకోవడం సరికాద‌న్నారు. టీడీపీ సభ్యులు మమ్మల్ని కూడా రెచ్చగొడుతున్నార‌ని పేర్కొన్నారు. 

Back to Top