ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీలో ఏ ఒక్కరికీ లేదు 

మంత్రి అంబ‌టి రాంబాబు
 

అమ‌రావ‌తి: ఎన్టీరామారావు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీలో ఏ ఒక్కరికీ లేద‌ని మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు. తెలుగుదేశం సభ్యుల ప్రవర్తన చాలా దురదృష్టకరం అన్నారు. రెడ్ లైన్ దాటి, స్పీకర్ పోడియం వద్దకు వచ్చి, దౌర్జన్యం చేస్తూ, కాగితాలు చించి పైకి విసురుతున్నారన్నారు.
ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న పచ్చకాగితాలు తెచ్చి చించి పడేయడం చూస్తే వారికి వాళ్ల నాయకుడు ఎన్టీరామారావు మీద ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోందని అన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు సభను బహిష్కరించి వెళ్లిపోయాడు, ఇతర నాయకులు రోజూ వచ్చి, బహిష్కరణకు గురయ్యేదాకా గొడవ చేస్తారన్నారు అంబటి.
 ఎన్టీ రామారావుగారు మాకు చాలాకాలం రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనకు గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం సైతం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు వైద్యులు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీని తెచ్చిన ఆ మహానుభావుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ మరణించాక టీడీపీ ఆయనను ఏమాత్రం గౌరవించలేదని,  
ఎన్టీఆర్ ను అవమానించింది చంద్రబాబే అని తెలిపారు. అధికారం కోసం వెన్నుపోటు పొడిచి, ఎన్టీరామారావు కుటుంబాన్ని చిందరవందర చేసిన వ్యక్తి చంద్రబాబే అన్నారు అంబటి.

వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించి, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణని దగ్గరకు తీసినట్టు నటించి, ఎన్టీఆర్ మరణించాక హరికృష్ణను వాడుకుని వదిలేసింది చంద్రబాబే అన్నారు. 

ఎన్టీ రామారావుగారికి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు అంబటి.  5రోజులుగా టీడీపీ వాళ్ల పాలసీ రావడం, గొడవ చేయడం, సస్పెండ్ చేయించుకుని వెళ్లిపోవడం..బయట ఉండి ఇదంతా డైరెక్ట్ చేయిస్తుంది చంద్రబాబే..
సిగ్గుంటే టీడీపీ నేతలు తమ నాయకుడు చంద్రబాబుతో కలిసే సభకు రావాలని, అంతేగానీ వచ్చి సభను పదే పదే డిస్టర్బ్ చేయకూడదని హెచ్చరించారు అంబటి రాంబాబు.  చంద్రబాబు కంటే కూడా ఎన్టీఆర్ పై గౌరవం మాకే ఉందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆయనను అగౌరవపరిచే ఉద్దేశం తమకు లేదని సభ సాక్షిగా మరోసారి స్పష్టం చేసారు. 

వైద్య రంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం నాడు నేడు, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నాడు వైయస్సార్ గారి వైద్యసంస్కరణలను గుర్తు చేసేలా హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరు పెట్టాలనే ప్రతిపాదన చేసింది. దీనిపై టీడీపీ గగ్గోలు చేసి గందరగోళం చేసి సభలో రౌడీయిజంతో ప్రవర్తించడం దురదృష్టకరమని అన్నారు మంత్రి అంబటి.

తాజా వీడియోలు

Back to Top