ఫ్యామిలీ హాస్పిటల్  సిబ్బంది నిర్లక్ష్యంపై  డిప్యూటీ సీఎం ఆగ్ర‌హం

ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని డిఎంఅండ్‌హెచ్‌వోకు మంత్రి ఆదేశాలు

 విజయవాడ: నగరంలోని డోర్నకల్ రోడ్డులో ఉన్న ఫ్యామిలీ హాస్పిటల్  సిబ్బంది నిర్లక్ష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో.. పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మంత్రి వెంటనే స్పందించారు. సత్వరమే ఆసుపత్రికి వెళ్లి ఘటనపై విచారించి తక్షణమే నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సుహాసినిని మంత్రి ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలపై ప్రతి రోజు సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. బిడ్డను కోల్పోయిన నిండు గర్భిణీ కుటుంబ సభ్యుల నుండి వివరాలు తెలుసుకుని పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. రోగులకు వైద్యం అందించే విషయంలో హాస్పిటల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top