సుప్రీం కోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

సచివాలయం: ఎన్నికల కోడ్‌ ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించడం మంచి పరిణామం అని, కోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సచివాలయంలో మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే ఈ రోజు నిజమైందన్నారు. ఎన్నికల కమిషనర్‌ వ్యవహరించిన తీరు సరికాదని సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పిందన్నారు.  ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించిందన్నారు. ఎన్నికల కోడ్‌ అడ్డం పెట్టి ప్రజలను టీడీపీ ఇబ్బంది పెట్టాలనుకుందన్నారు. కానీ, కోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు జరుగుతాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ రెట్టింపు మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top